వరంగల్ – వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన ఆర్మీ జవాన్ సంపంగి నాగరాజు (28) జమ్ముకశ్మీర్‌లో విధులు నిర్వహిస్తూ మూడు రోజుల క్రితం తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటనను ఆర్మీ అధికారులు గోప్యంగా ఉంచడంతో, నాగరాజు కుటుంబానికి సమాచారం ఆలస్యంగా అందింది. ఈ రోజు ఆయన మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు, దీంతో వారు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. నాగరాజు దేశ సేవ కోసం అంకితభావంతో పనిచేసిన యువ జవాన్ కాగా. అధికారులు ఈ ఘటన వివరాలను బహిర్గతం చేయకపోవడంతో, కుటుంబ సభ్యులు సమాచార లోపంతో తీవ్ర ఆవేదనకు గురయ్యారు.
స్వగ్రామంలో..
సంపంగి నాగరాజు మరణం స్థానిక ప్రజల్లో విషాదాన్ని నింపింది. కుటుంబ సభ్యులు, స్నేహితులు, గ్రామస్తులు ఆయనను కోల్పోవడంతో శోకసంద్రంలో మునిగిపోయారు. నాగరాజు తల్లిదండ్రులు, భార్య, బంధువులు ఈ దుర్ఘటనను తట్టుకోలేక దుఃఖిస్తున్నారు. ఈ ఘటన ఆర్మీ జవాన్ల మానసిక ఆరోగ్యం, వారి కుటుంబాలకు సకాలంలో సమాచారం అందించడం వంటి అంశాలపై చర్చను రేకెత్తించింది. అయితే అసలు నాగరాజు ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు. సమస్య ఏంటనే విషయాలు మాత్రం తెలియాల్సి ఉంది.