ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పుస్తకాల పంపిణీ…
కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ : కమ్మర్ పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం విద్యార్థిని, విద్యార్థులకు పుస్తకాలను ఉపాధ్యాయులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఇంచార్జ్ ప్రిన్సిపల్ వైష్ణవి మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ విద్యా సంవత్సరం నుంచి విద్యార్థిని,విద్యార్థులకు అల్పాహారం,మధ్యాహ్న భోజనం పథకాన్ని ప్రవేశ పెడుతున్నట్లూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో తెలియజేసిన విషయం విధితమే.
విద్యార్థిని,విద్యార్థులు ప్రభుత్వ కళాశాలల్లో చదువుకున్న వారికి ఇంజనీరింగ్ విభాగంలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ఉంటుందని, అంతేగాక 10000 పైన ర్యాంకు వచ్చిన ఇంజనీరింగ్ కళాశాలలో మొదటి ప్రాధాన్యత వీరికే ఉంటుందని కావున ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకొని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుకోవాలని ఇంచార్జ్ ప్రిన్సిపల్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు వెంకటేష్, శ్రీహరి, మహేందర్, మురళి, ఆనంద్, స్వాతి, సుమతి విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.
