Ravi Shastri | ఇంగ్లాండ్ హెడ్ కోచ్ గా రవిశాస్త్రి కావాలి..

Ravi Shastri | ఇంగ్లాండ్ హెడ్ కోచ్ గా రవిశాస్త్రి కావాలి..
- కివీస్‌తో ‘బాజ్‌బాల్’ అట్టర్ ఫ్లాప్…
- భారత్ వైపు ఇంగ్లాండ్ చూపు…
- టీమిండియా వ్యూహమే మాకు శరణ్యం..
- రవిశాస్త్రిని కోరుకుంటున్న ఇంగ్లాండ్ మాజీలు…
ఆంధ్రప్రభ : క్రికెట్ కు పురిటిగడ్డ అయిన ఇంగ్లాండ్, ఇప్పుడు తన మనుగడ కోసం భారత్ వైపు ఆశగా చూస్తోంది. ఒకప్పుడు ప్రపంచ క్రికెట్‌ను శాసించిన ఇంగ్లీష్ జట్టు, ఇప్పుడు వరుస పరాజయాలతో సతమతమవుతుంది. తమను మళ్ళీ విజయపథంలో నడిపించే “మ్యాజికల్ హ్యాండ్” కోసం అన్వేషిస్తోంది.
తాజాగా ఆస్ట్రేలియా చేతిలో ఎదురైన ఘోర పరాజయం ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డును (ECB) డిఫెన్స్ మోడ్ లో పడేసింది. ఈ సంక్షోభం నుండి గట్టెక్కాలంటే.. టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రిని (Ravi Shastri) తమ జట్టుకు కోచ్ నియమించాలనే డిమాండ్లు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇంగ్లాండ్ జట్టుకు మళ్ళీ పూర్వవైభవం రావాలంటే భారతీయ వ్యూహాలే సరైన మందు అని ఆ దేశ మాజీ క్రికెటర్లే బహిరంగంగా చెబుతుండటం విశేషం.
Jyothi Yarraji | ట్రెండింగ్ లో మన హర్డిల్ జింక !! ఎందుకు ?
యాషెస్ సిరీస్‌లో ‘క్లీన్ స్వీప్’..
ఆస్ట్రేలియాతో జరిగిన 2025-26 యాషెస్ సిరీస్‌లో ఇంగ్లాండ్ జట్టు కేవలం 11 రోజుల్లోనే ఘోర పరాజయాన్ని చవిచూసింది. దీంతో ఆ దేశ క్రికెట్ వర్గాల్లో పెను దుమారం రేగుతోంది. ఈ వరుస ఓటములకు బాధ్యత వహిస్తూ హెడ్ కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్‌ను తొలగించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.
మెక్కల్లమ్ ప్రవేశపెట్టిన ‘బాజ్‌బాల్’ (Bazball) వ్యూహం స్వదేశంలో పని చేసినా.. ఆస్ట్రేలియాలోని పేస్, బౌన్స్ పిచ్‌లపై దారుణంగా విఫలమైందని అభిమానులు దుమ్మెత్తిపోస్తున్నారు. గెలుపు కోసం అతిగా ప్రయత్నించి, బ్యాటర్లు తమ వికెట్లను చేజేతులా పారేసుకోవడం ఇంగ్లాండ్‌ను దెబ్బతీసిందనే విమర్షలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో జట్టుకు కొత్త మైండ్‌సెట్ అవసరమని విశ్లేషకులు భావిస్తున్నారు.
England Cricket | తాగి తందనాలు..!
రవిశాస్త్రి వైపు మొగ్గు చూపడానికి కారణం ఇదే..
ఈ క్లిష్ట సమయంలో ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ మోంటీ పనేసర్ చేసిన వ్యాఖ్యలు క్రికెట్ ప్రపంచంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మెక్కల్లమ్ స్థానంలో రవిశాస్త్రిని హెడ్ కోచ్‌గా తీసుకురావాలని మోంటీ పనేసర్ గట్టిగా కోరుతున్నారు. ఆస్ట్రేలియా జట్టును వారి సొంత గడ్డపైనే చిత్తు చేసిన రికార్డు రవిశాస్త్రికి మాత్రమే ఉందని పనేసర్ గుర్తు చేశారు.
“ఆస్ట్రేలియాను శారీరకంగా, మానసికంగా ఎవరు దెబ్బకొట్టగలరు? వారి వ్యూహాలను ఎవరు చిత్తు చేయగలరు అని ఆలోచిస్తే నాకు రవిశాస్త్రి మాత్రమే కనిపిస్తున్నారు. ఇంగ్లాండ్ జట్టుకు ఇప్పుడు కావాల్సింది ఆయన అగ్రెసివ్ కోచింగ్ మాత్రమే” అని పనేసర్ స్పష్టం చేశారు. రవిశాస్త్రి వద్ద ఉన్న ఆత్మవిశ్వాసం, ఆటగాళ్లలో కసిని పెంచే గుణం ఇంగ్లాండ్ జట్టుకు ఇప్పుడు సంజీవనిలా మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

భారత క్రికెట్‌లో Ravi Shastri ‘గోల్డెన్ ఎరా’
రవిశాస్త్రి టీమిండియా హెడ్ కోచ్‌గా ఉన్న 2017 నుండి 2021 సమయంలో.. భారత క్రికెట్ ఒక స్వర్ణయుగాన్ని చూసింది. ముఖ్యంగా విదేశీ గడ్డపై భారత్ ఒక తిరుగులేని శక్తిగా ఎదిగింది. ఆస్ట్రేలియాలో వరుసగా రెండుసార్లు (2018-19 & 2020-21) బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని గెలుచుకుని, అక్కడ సిరీస్ నెగ్గిన తొలి ఆసియా జట్టుగా భారత్ చారిత్రక రికార్డు సృష్టించింది. కేవలం ఆస్ట్రేలియానే కాదు, సేనా (SENA) దేశాలపై కూడా టీమిండియా పంజా విసిరింది.
న్యూజిలాండ్‌ను వారి స్వదేశంలోనే 5-0తో టీ20 సిరీస్‌లో క్లీన్ స్వీప్ చేయడం, సౌతాఫ్రికాలో వన్డే సిరీస్ గెలవడం వంటివి రవిశాస్త్రి కోచింగ్ పవర్‌కు నిదర్శనాలు. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో భారత్ సుదీర్ఘ కాలం పాటు నంబర్ 1 స్థానంలో కొనసాగడంతో పాటు, మొట్టమొదటి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్‌కు చేరుకోవడంలో ఆయన పాత్ర వెలకట్టలేనిది.
ఆస్ట్రేలియాలో బాజ్‌బాల్ వైఫల్యం.. మెక్కల్లమ్ భవిష్యత్తుపై నీలినీడలు
మెక్కల్లమ్ ఆధ్వర్యంలోని ‘బాజ్‌బాల్’ (Bazball) దూకుడు ఆటతీరు గతంలో ప్రశంసలు అందుకున్నప్పటికీ, 2024 నుండి ఇంగ్లాండ్ ఆశించిన ఫలితాలను సాధించలేకపోతోంది. గత 25 టెస్టుల్లో 12 గెలిచి 13 ఓడిపోవడంతో ఈ వ్యూహం ఎంతవరకు సరైనదనే విమర్శలు వస్తున్నాయి.
అతి దూకుడుగా ఆడి ప్రత్యర్థిని భయపెట్టాలనే మెక్కల్లమ్ ‘బాజ్‌బాల్’ సిద్ధాంతం ఆస్ట్రేలియాలో తలకిందులైంది. రక్షణాత్మకమైన ఆటను (Defense) పూర్తిగా విస్మరించడంతో జో రూట్, హ్యారీ బ్రూక్ వంటి స్టార్ బ్యాటర్లు కూడా ఆసీస్ బౌలర్ల ధాటికి నిలవలేకపోయారు. దీనికి తోడు నాథన్ లియాన్ వంటి నాణ్యమైన స్పిన్నర్ లేకపోవడం ఇంగ్లాండ్‌కు మైనస్ అయింది.
తన భవిష్యత్తుపై స్పందించిన మెక్కల్లమ్, తాను కొనసాగాలా వద్దా అనేది తన చేతుల్లో లేదని, అది బోర్డు నిర్ణయమని వ్యాఖ్యానించారు. ఒకవేళ ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు తమ పంథాను మార్చుకోవాలని భావిస్తే, రవిశాస్త్రి వంటి లెజెండరీ కోచ్ ఇంగ్లాండ్ పగ్గాలు చేపట్టే అవకాశాలను కొట్టిపారేయలేం. క్రికెట్ పుట్టిన దేశం, భారత కోచ్ కోసం ఎదురుచూడటం అనేది భారత క్రికెట్ సత్తాకు దక్కిన గౌరవంగా భావించవచ్చు.
