Successful Hero | కిరణ్ అబ్బవరం చెన్నై లవ్ స్టోరీ..
Successful Hero | కిరణ్ అబ్బవరం చెన్నై లవ్ స్టోరీ..
Successful Hero | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : సక్సెస్ ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం, యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ శ్రీ గౌరి ప్రియ (Shri Gauri Priya) జంటగా నటిస్తున్న మూవీ చెన్నై లవ్ స్టోరీ. కలర్ ఫొటో, బేబి వంటి కల్ట్ క్లాసిక్ మూవీస్ ప్రేక్షకులకు అందించిన దర్శక నిర్మాత సాయి రాజేశ్, ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ కలిసి నిర్మిస్తున్న సినిమా ఇది. ఈ కాంబోలో రూపొందుతున్న ఈ చెన్నై లవ్ స్టోరీ చిత్రాన్ని అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై సాయి రాజేశ్, ఎస్ కేఎన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
సాయి రాజేశ్ కథను అందించిన ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహిస్తున్నారు. న్యూ ఇయర్ డే (Newyear Day) సందర్భంగా ప్రేక్షకులకు విశెస్ అందించారు చెన్నై లవ్ స్టోరీ మూవీ టీమ్. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. మెలొడీ బ్రహ్మ మణిశర్మ ఈ విభిన్న ప్రేమకథా చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. వైవిధ్యంగా రూపొందుతోన్న ఈ చెన్నై లవ్ స్టోరీ సినిమాని గ్రాండ్ గా సమ్మర్ లో థియేట్రికల్ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే రిలీజ్ డేట్ అఫిషియల్ గా అనౌన్స్ చేయనున్నారని సమాచారం.
