Ramcharan| పెద్ది సెకండ్ సింగిల్ ప్లాన్ ఏంటి..?

Ramcharan| పెద్ది సెకండ్ సింగిల్ ప్లాన్ ఏంటి..?
Ramcharan| ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు తెరకెక్కిస్తోన్న మూవీ పెద్ది. ఈ సినిమాకి సంగీత సంచలనం ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ తో రూపొందుతోన్న ఈ సినిమాలో చరణ్ క్రికెటర్ గా నటిస్తున్నాడు. చరణ్ లుక్, బాడీ లాంగ్వేజ్.. చాలా డిఫరెంట్ గా ఉంది. ఇటీవల ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ చికిరి చికిరి అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ ను ఇలా రిలీజ్ చేసారో లేదో.. అలా యూట్యూబ్ లో రికార్డ్ వ్యూస్ తో దూసుకెళ్లింది. ట్రెండింగ్ లోకి వచ్చి టాప్ లో నిలిచింది..
పెద్ది ఫస్ట్ సింగిల్ సక్సెస్ అయ్యింది. మరి.. నెక్ట్స్ ప్లాన్ ఏంటంటే.. సెకండ్ సింగిల్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ పాటను సంక్రాంతికి విడుదల చేయనున్నారని.. టాక్ వినిపిస్తోంది. సంక్రాంతి టైమ్ లో సాంగ్ రిలీజ్ చేస్తే.. రీచింగ్ ఎక్కువుగా ఉంటుందనే ఉద్దేశ్యంతో ఇలా ప్లాన్ చేసారట. అయితే.. అఫిషియల్ గా ఇంకా అనౌన్స్ మెంట్ రాలేదు. త్వరలో ప్రకటిస్తారని టాక్. ఇటీవల ఢిల్లీలో రామ్ చరణ్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ షెడ్యూల్ తో దాదాపు షూటింగ్ పూర్తవుతుంది. అయితే.. కొంత ప్యాచ్ వర్క్ చేయాల్సివుంది. ఈ ప్యాచ్ వర్క్ కూడా కంప్లీట్ చేసిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ లో మరింత స్పీడు పెంచనున్నారు. మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా పెద్ది సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
