drunkanddrive | బండి నడపకపోయినా డ్రంక్ అండ్ డ్రైవ్ చలానా..!
drunkanddrive | బండి నడపకపోయినా డ్రంక్ అండ్ డ్రైవ్ చలానా..!
drunkanddrive | బోయిన్‌పల్లిలో విచిత్ర ఘటన
డ్రైవర్‌కు కాకుండా వెనుక కూర్చున్న వ్యక్తికి పరీక్షలు
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటో
పోలీసుల తీరుపై నెటిజన్ల ప్రశ్నలు
అధికారిక వివరణ కోసం ఎదురుచూపులు
సిరిసిల్ల, ఆంధ్రప్రభ : ఈ చిత్రంలోని.. సిత్రం చూడండి.. బండి నడిపిన వారికి కాకుండా వెనకాల కూర్చున్న వారికి డ్రంకన్ డ్రైవ్ టెస్ట్ చేసి చలాన్ విధించారు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి పోలీసులు.. నిబంధనల ప్రకారం వాహనం నడిపే వారికి డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించి మద్యం మత్తులో ఉన్నట్లు తేలితే కేసు నమోదు చేస్తారు పోలీసులు.. కానీ ఇక్కడి పోలీసులు బండి నడిపిన వారికి కాకుండా వెనకాల వాహనం పై కూర్చున్న వ్యక్తికి పరీక్షలు. నిర్వహించి చలానా సైతం విధించారు. వాహనం నడిపే వ్యక్తికి హెల్మెట్ ఉంది. మద్యం సేవించలేదు. వెనకాల కూర్చున్న వ్యక్తి మద్యం సేవించి ఉన్నాడని గమనించిన పోలీసులు అతనికి టెస్ట్ చేసి చాలన్ విధించడం ఆశ్చర్యం కలిగిస్తుంది.. ఈ చిత్రమైన సంఘటన బోయిన్పల్లి మండలంలో చోటు చేసుకోవడం తో నెటిజెన్లు ఇదేం విడ్డూరమంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
