Gajjelamma | కొలనులో వెలసిన గ్రామ దేవత

Gajjelamma | కొలనులో వెలసిన గ్రామ దేవత

  • నేటి నుంచి ఆరో వార్షికోత్సవ ప్రారంభం
  • ముస్తాబైన గజ్జలమ్మ దేవి ఆలయం
  • శ్రీ గజలమ్మ దేవి

Gajjelamma | కుంటాల, ఆంధ్రప్రభ : ఇలవేల్పు గజ్జలమ్మ ఆలయాన ఆరో వార్షికోత్సవ వేడుకలు నిర్వహించనున్నారు. ప్రారంభం కానున్న నేపథ్యంలో 29 మొదటి రోజు భగవతి ప్రార్థన విశేష సంకల్పం మహాగణపతి పూజ పుణ్యవచరం యాగశాల ప్రవేశము సంస్కారం క్షేత్రపాలక నవగ్రహ యాగిని నవగ్రహ సర్వతో భద్ర తాపీన అగ్ని తాపిన అగ్ని ప్రతిష్ట స్థాపిత కుంకుమార్చన, మంత్రపుష్పం, ప్రసాద వితరణ, 30వ‌ తేదీ రోజు నిత్య నిధి యజ్ఞ కార్యక్రమం గజ్జ‌లమ్మ కళ్యాణం, రథోత్సవం, మంత్రపుష్పం ,తీర్థ ప్రసాద వితరణ తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు. 31 నిత్య నిధి మహా పూర్ణాహతి, కుంభాభిషేకం, గ్రామ మహిళలచే బోనాల పండుగ నిర్వహించనున్నట్టు ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు.

కలలోకి వచ్చి… కోనేరులో ప్రత్యక్షమైన గజ్జలమ్మ దేవి…

Gajjelamma |

కుంటాల గ్రామానికి చెందిన సుమారు 150 ఏళ్ల చరిత్ర ఉంటుంది. ఇప్పటివరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఉన్న కుంటాల ప్రస్తుతం నిర్మల్ జిల్లాలో కొనసాగుతుంది. పూర్వం కుంటాలకు చెందిన మూసరి వంశ‌స్థులు నిత్యం అడవికి వేటకు వెళ్లేవారు. అందులో ముత్యం అనే వ్యక్తికి ఒకరోజు నీటి గుంటలో విగ్రహం కనిపించింది.

Gajjelamma |
Gajjelamma |

రాత్రి అతని కలలోకి వచ్చి నా పేరు గజ్జ‌లమ్మ అని…. ఢిల్లీ సమీపంలోని గజ్జపురం నుంచి వచ్చానని, నన్ను కొలిస్తే అంతా మంచి జరుగుతుందని చెప్పింది. మనసుటి రోజు విషయాలు గ్రామస్తులకు వివరించాడు. దీంతో గ్రామస్తులు నీటి గుంటలో ఉన్న విగ్రహాన్ని బయటకు తీసి ఓ చెట్టు కింద ప్రతిష్టాపించారు.

ఆ తర్వాత కొన్ని రోజులకు చిన్న గుడి కట్టించారు. గత బి.ఆర్.ఎస్ పాలనలో మాజీ మంత్రి దేవాదాయ అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి సహకారంతో రూ. 51 లక్షలతో ఆలయాన్ని పునః నిర్మించాలని, కుంటాల సుమారు 4700కు పైచిలుకు జనాభా ఉండగా కులాలకు అతీతంగా సగానికి పైగా జనానికి పేర్లు అమ్మవారి పేర్లు ఉండటం విశేషం.

నైవేద్యం… ప్రత్యేకం

ప్రస్తుతం ట్రెండు మారిన ఆ గ్రామంలో పుట్టిన పిల్లలకు గజ్జ‌లమ్మ నామకరణం చేయడం ఆనమైతిగా వస్తుంది. పెళ్లిళ్ల‌కు తలనీలాలు తదితర శుభకార్యాలు జరుగుతే గజ్జ‌లమ్మకు బోనం సమర్పించడం తప్పనిసరి. అంతేకాకుండా అమ్మవారికి నైవేద్యం సమర్పించడంలో ప్రత్యేకత ఉంది. గంగనీరు జాతర సందర్భంగా అమ్మవారి నగలను దిలావాల్ పూర్ మండలంలోని న్యూ సాంగి గోదావరికి వెళ్లి శుద్ధి చేస్తారు. అప్పటి నుంచి ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు.

మాఘమాసంలో రాత్రి వండినా అన్నం ఉదయం పెరుగుతో చనిపోనంగా ఆనవాయితీగా గ్రామాల్లోని గ్రామదేవతలకు అమావాస్య పురస్కరించుకొని అమ్మవార్ల‌కు బోనాలను సమర్పిస్తారు. అమ్మవారి జాతర నిర్వహిస్తారు. ఉల్లిగడ్డలు, పుట్నాలు నైవేద్యంగా సమర్పించి మొక్కలు తీర్చుకుంటారు. ప్రతి ఆదివారం బోనాలు, చిన్న పిల్లలకు తలనీరాలు తల భారం వేస్తారు. ప్రతి ఆదివారం మహారాష్ట్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి భక్తులు త‌ర‌లి వస్తారు. ముంబై హైదరాబాద్ నగరాల్లో స్థిరపడిన వారు అక్కడ గజ్జలమ్మ ఆలయంలోని ప్ర‌త్యేక‌ పూజలు చేపడతారు. దీంతో అమ్మవారికి ఎంతో దూరం నుండి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు.

అమ్మవారికి బోనం సమర్పిస్తాం… ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్… గజలక్ష్మి…

మాది ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ గ్రామం. మా ఇంటి దైవం గజ్జలమ్మ. మా ఇంట్లో ఏ శుభకార్యం చేసినా కుటుంబ సభ్యులతో కలిసి కుంటాల గజ్జలమ్మ అమ్మవారికి తప్పకుండా బోనం సమర్పించిన అనంతరమే శుభ కార్యాలయాలు, ముహూర్తాలు పెట్టుకుంటాం.

అదృష్టంగా… భావిస్తున్న… గజ్జలమ్మ ఆలయ అర్చకుడు నాగేష్

మా తాతయ్య మూసరి ముత్యం. అతనికి గజ్జలమ్మ దేవి కలలో కనిపించింది. గ్రామస్తులకు చెప్పడంతో గుడి కట్టించారు. అయితే ప్రతి ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు మహారాష్ట్ర ప్రాంతంతో పాటు ముంబై హైదరాబాద్ ప్రాంతాల నుండి కాకుండా వివిధ ప్రాంతాల నుండి గజలమ్మ దేవి దర్శనానికి తరలివస్తారు. అమ్మవారికి సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నాను.

Leave a Reply