Central Prison | జైల్లో అస్వస్థతకు గురి..

Central Prison | ఆరిలోవ, విశాఖపట్నం, ఆంధ్రప్రభ : విశాఖ కేంద్ర కారాగారంలో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న ఖైదీ అనారోగ్యంతో మృతి చెందాడు. పార్వతీపురం ప్రాంతానికి చెందిన సొండి చిన్న అప్పలస్వామి (57) సోమవారం సాయంత్రం అస్వస్థతకు గురికావడంతో జైలు అధికారులు ప్రాథమిక చికిత్స అందించారు.

ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వెంటనే కింగ్ జార్జ్ ఆసుపత్రి (కేజీహెచ్)కు తరలించి చికిత్స అందించారు. అయితే చికిత్స పొందుతూ అప్పలస్వామి మృతి చెందినట్లు ఆరిలోవ సీఐ ఎస్. శ్రీనివాస్ తెలిపారు.

మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించనున్నట్లు పోలీసులు వెల్లడించారు.