అమరుల త్యాగఫలమే స్వాతంత్య్రం
స్వాతంత్య్ర సమరయోధుల ఆశయాల సాధనకు కృషి చేయాలి: సర్పంచ్ లావణ్య
దేశ ప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు
ఎల్కతుర్తి, ఆంధ్రప్రభ : అమరుల త్యాగఫలితంగానే దేశానికి స్వాతంత్య్రం లభించిందని ఎల్కతుర్తి గ్రామ సర్పంచ్ మునిగడప లావణ్య అన్నారు. 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
సర్పంచ్ లావణ్య మాట్లాడుతూ ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్య్రం లభించిందన్నారు. స్వాతంత్య్ర పోరాట వీరులను స్మరించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. వారి వీరోచిత పోరాటాల ఫలితంగానే నేడు స్వేచ్ఛగా జీవించగలుగుతున్నామని అన్నారు. అమరవీరులను స్మరించుకుంటూ వారి ఆశయాల సాధనకు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ గోడిశాల రాజు, కార్యదర్శి శ్రీనివాస్, వార్డు సభ్యులు, సీఏ కవిత, ఏపీఎం కవిత, మాజీ ప్రజాప్రతినిధులు, మహిళలు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
