SRH vs LSG | ఎస్‌ఆర్‌‌హెచ్‌కి షాకిచ్చిన శార్దూల్..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025లో భాగంగా ఈరోజు హైదరాబాద్‌లో లక్నోతో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ చేస్తోంది.

ఇదిలా ఉండగా, ఆరంభంలోనే ఎస్‌ఆర్‌‌హెచ్ విధ్యంసక బ్యాటర్లను పెవిలియన్‌కు పంపి.. ఆరెంజ్ ఆర్మీకి షాక్ ఇచ్చాడు శార్దూల్ ఠాకూర్. ఓపెనర్ అభిషేక్ శర్మ (6)తో పాటు మునుపటి మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన ఇషాన్ కిషన్ (0)లను మూడో ఓవర్ తొలి రెండు బంతుల్లో అవుట్ చేసిన శార్దూల్ ఎస్‌ఆర్‌‌హెచ్ కి గట్టి దెబ్బ కొట్టాడు.

ప్ర‌స్తుతం క్రీజులో ట్రావిస్ హెడ్ (31) – నితిష్ కుమార్ రెడ్డి (6) ఉన్నారు. కాగా, నాలుగు ఓవర్లు ముగిసే సరికి హైదరాబాద్ స్కోర్ 45/2

Leave a Reply