విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తిని పెంపొందించాలి..
ఊట్కూర్, ఆంధ్రప్రభ : విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తిని పెంపొందించాలని ఊట్కూర్ మండల విద్యాశాఖ అధికారి (ఎంఈఓ) మాధవి అన్నారు.
సోమవారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాల, జీపీఎస్, పీఎస్ పాఠశాలల్లో వ్యాయామ ఉపాధ్యాయురాలు షేర్ పారిజాత, కృష్ణారెడ్డి దంపతుల కుమార్తె హారిక పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులకు క్రీడా సామగ్రిని పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎంఈఓ మాధవి మాట్లాడుతూ, ఉపాధ్యాయ దంపతులు తమ కుమార్తె పుట్టినరోజును సామాజిక సేవకు అంకితం చేస్తూ విద్యార్థుల మధ్య జరుపుకోవడం అభినందనీయమన్నారు. విద్యార్థుల్లో క్రీడా ప్రతిభను పెంపొందించేందుకు క్యారం బోర్డులు, రింగ్ బాల్స్, స్కిప్పింగ్ రోప్స్, ప్లాస్టిక్ బాల్స్ పంపిణీ చేయడం సంతోషకరమని తెలిపారు.
వ్యాయామ ఉపాధ్యాయురాలు పారిజాత మాట్లాడుతూ, తమ కుమార్తె హారిక పుట్టినరోజును విద్యార్థులతో కలిసి అర్థవంతంగా జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. భవిష్యత్తులోనూ ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు గురునాథ్, గోవర్ధన్, భాస్కర్, నారాయణ, రామచంద్రరెడ్డి, ప్రేమకుమారి, అరుణ, అంజమ్మ, రాధా, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
