గ్రామాలను సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దుతాము కేంద్రమంత్రి..
నరసన్నపేట నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ప్రారంభించిన రామ్మోహన్ నాయుడు
నరసన్నపేట, ఆంధ్రప్రభభ : గ్రామాలను సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దుతామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు . సోమవారం నరసన్నపేట నియోజకవర్గం పోలాకి మండలంలో పలు అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, శాసన సభ్యులు బగ్గు రమణమూర్తి తో కలసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన గొల్లలవలస చెరువు నుంచి డీపీఎన్ రోడ్డు వరకూ కోటి రూపాయలతో నిర్మించిన బీటీ రహదారి, 12.98 లక్షలతో నిర్మించిన హెల్త్ క్లినిక్ సెంటర్, దీర్గాశి నుండి గొల్లలవలస వరకు 80 లక్షలతో నిర్మించిన బిటి రోడ్డు, కొల్లివలస – మబగాం వరకు 1.90 కోట్లతో నిర్మించిన సిసి రోడ్లను, ఖాన్ సాహెబ్ పేట వద్ద మబగాం నుండి కాంచీపేట కు 50 లక్షలతో సిసి రోడ్డు, జలజీవన పథకం కింద కాంచీపేటకు 15 లక్షల రూపాయలతో రక్షిత మంచి నీటి పథకాన్ని ఆయన ప్రారంభించారు. మబగాం కాలనీ 21.10 లక్షలతో జలజీవన మిషన్ కింద రక్షిత మంచి నీటి పథకానికి ఆయన శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హెల్త్ క్లినిక్ కు సంబంధించి ఆబా కార్డు గూర్చి డిఎంహెచ్ఓ ను మంత్రి అడగగా ఆబా కార్డులకు సంబంధించి డిఎంహెచ్ఓ మంత్రికి వివరించారు. ఆసుపత్రికి ఫర్నిచర్ కోసం అడిగి తెలుసుకున్నారు.
గొల్లలవలస, దీర్గాశి, మబగాం గ్రామాలు రావడం నాకెంతో ఆనందంగా ఉందన్నారు. తన తండ్రి కింజరాపు ఎర్రన్నాయుడు ఉన్నప్పటి నుంచి మమ్మల్ని అందరిని ఆదరించి మీ గుండెల్లో పెట్టుకొని మీరందరూ ఎంతో ఆదరణ, ప్రేమ, అభిమానం మాకు ఎల్లప్పుడూ కూడా చూపిస్తున్నందుకు గ్రామస్తులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. మాకు కూడా మీ తాలూకా రుణం తీర్చుకోవాలనే ఆలోచనతో గొల్లలవలసకి ప్రాధాన్యత ఇస్తూ, గొల్లలవలస గ్రామం తాలూకా సమస్యల్లో ప్రభుత్వం తాలూకా పాత్ర పూర్తిగా మీ అందరికీ కూడా సహకరించే విధంగా గతంలో 2014-19 లో కూడా చాలా కార్యక్రమాలు చేయడం జరిగిందన్నారు. తిరిగి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ గ్రామంలో అభివృద్ధి అనడానికి ఒక ఉదాహరణగా కొన్ని కార్యక్రమాలు జరిగినట్లు చెప్పారు. ఇప్పుడు కూడా మీరు చూసుకుంటే పోలాకి వరకు, డోల వరకు ఉన్నటువంటి రోడ్డు 1 కోటి రూపాయలతో బ్రహ్మాండమైనటువంటి రోడ్డు ఈరోజు మనం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

1.20 కోట్లు తోటాడ రోడ్డు కూడా మనం కేటాయించడం జరిగినట్లు చెప్పారు. అసంపూర్తిగా ఉన్నటువంటి హెల్త్ వెల్నెస్ సెంటర్ భవనానికి కూడా సుమారు మరొక 13 లక్షలు కేటాయించి బ్రహ్మాండంగా గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా ఆరోగ్యం బాగుండాలనే ఆలోచనతో ఈ భవనాన్ని పూర్తి చేసుకున్నట్లు వివరించారు. గ్రామంలో ఏ చివరికి వెళ్ళినా, ఏ కార్యక్రమం మీరు చూసినా సరే అది చంద్రబాబు నాయుడు హయాంలో చేసినవేనన్నారు. మరెప్పుడూ కూడా ఏ కార్యక్రమం జరగలేదని తెలియజేశారు. గతంలో కూడా స్మశాన వాటిక, ఊరికి కావలసిన రోడ్డు, స్టేజ్ ఇలా ఏ చిన్న, పెద్ద కార్యక్రమం చెప్పినా గ్రామస్తులకు న్యాయం చేయాలనే ఆలోచనతో సంపూర్ణ మద్దతు అందించడం జరిగిందన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాగే చేస్తూ ఉంటామన్నారు.
ఏదైనా ఒక కార్యక్రమం చేయాలంటే నిధులు మన గ్రామం తీసుకొని వచ్చి, వీలైనంత మేరకు ఒక్కొక్క కార్యక్రమం చేసుకుంటూ వెళ్ళాలనే ఆలోచనతో ఈరోజు అంచలంచలుగా కొన్ని కార్యక్రమాలు చేస్తున్నట్లు చెప్పారు.
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్ల ను కార్యక్రమం 3000 నుంచి 4000 రూపాయలు. అలాగే తల్లికి వందనం కార్యక్రమం కింద ఎంత మంది పిల్లలు ఉంటే అందరికీ 15,000 రూపాయలు ఇచ్చామన్నారు. స్త్.. శక్తి కింద మహిళలు బస్సు ఎక్కి వెళ్ళాలన్నా ప్రయాణం ఉచితం చేసి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా చేశామన్నారు. అన్నదాత సుఖీభవ కింద సంవత్సరానికి 20,000 రూపాయలు రైతన్నల అకౌంట్లలో నేరుగా వేసే కార్యక్రమం చంద్రబాబు నాయుడు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదవాల కోసం, గ్రామాల్లో ఉన్న వ్యక్తుల కోసం, మన రైతుల కోసం, మహిళల కోసం ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నామన్నారు. ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు ఉన్నట్లు చెప్పారు. మరిన్ని కార్యక్రమాలు చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచన చేస్తున్నారని, కానీ రాష్ట్రం తాలూకా ఆర్థిక స్థితిగతులు మెరుగుపడే కొద్దీ, రాష్ట్రం బలపడే కొద్దీ మిగిలిన కార్యక్రమాలు కూడా చేయడానికి అవకాశం ఉంటుందన్నారు.
గ్రామాలను సర్వాంగసుందరంగా, అందంగా తయారు చేస్తామన్నారు. అలాగే ప్రజలు ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలనే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ రెండు సంవత్సరాలు మీరు చూశారు, మళ్ళీ ఊపిరి పోసుకున్నట్టుగా అయిందన్నారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా ఊర్లో ఉన్న పెద్దలో, అధికారుల వద్దకు వెళ్లి సమస్య పరిష్కారించుకోవచ్చన్నారు.
గృహాలు లేనటువంటి వారు ఎవరైతే ఉన్నారో, వాళ్ళందరికీ కూడా గృహాలు కేటాయించి, ప్రభుత్వం నుంచి నిధులు కేటాయించి గృహాలు కట్టించే కార్యక్రమం అతి త్వరలోనే కూటమి ప్రభుత్వం చేపట్టబోతుందని స్పష్టం చేశారు. అత్యంత అవసరమున్న నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్లందరికీ గృహాలు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. పెన్షన్లు కూడా అదనంగా ఎవరైతే అర్హులు ఉన్నారో వితంతు పెన్షన్ కావచ్చు, వికలాంగ పెన్షన్ కావచ్చు, ఇవన్నీ కూడా కొత్త పెన్షన్లు ఏవైతే ఉన్నాయో అన్ని సర్వే చేసి సిద్ధంగా ఉన్నాయన్నారు. ముందు తల్లికి వందనం కార్యక్రమం చేయాలనేది చంద్రబాబు నాయుడు ఆలోచనని, అది అయిన వెంటనే కొత్త పెన్షన్లు కూడా ఎవరెవరైతే అర్హులు ఉన్నారో వాళ్లకి కొత్త పెన్షన్లు అతి త్వరలోనే మంజూరు చేస్తామన్నారు. ప్రతి సంవత్సరం కూడా చంద్రబాబు నాయుడు చేస్తున్న కార్యక్రమాలు మూడు సిలిండర్లు, తల్లికి వందనం, స్త్రీ శక్తి ఇవన్నీ కూడా నిరంతరం కొనసాగుతూనే ఉంటాయన్నారు.

ఈ రెండు సంవత్సరాల్లో చాలా బాగానే మంచి పరిపాలనతో మనం ముందుకు వెళ్ళామన్నారు. రానున్న రోజుల్లో మిగిలిన కార్యక్రమాలు కూడా చేయడానికి చంద్రబాబు నాయుడు, మన ప్రభుత్వం, పవన్ కళ్యాణ్, ప్రధానమంత్రి మోదీ అందరి సహకారం తీసుకొని మిగిలిన కార్యక్రమాలన్నీ కూడా చేస్తామన్నారు. జల్ జీవన్ మిషన్ అనే కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం సహకారంతో, రాష్ట్ర ప్రభుత్వ వాటాతో ఇంటింటికి కొళాయి కార్యక్రమం చేపడుతున్నట్లు చెప్పారు. మీ అందరికీ కూడా మాట ఇచ్చాం. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామన్నారు. ఇంటింటికి కొళాయి కూటమి ప్రభుత్వం తాలూకా హామీ అని, ఆ హామీ ప్రకారం మన నరసన్నపేట నియోజకవర్గంలో కూడా పథకం మంజూరు చేసి, నిధులు కూడా దానికి కేటాయించినట్లు చెప్పారు. పనులు త్వరితగతిన పూర్తి చేసుకొని గ్రామంలో ఇంటింటికి కూడా కొళాయి ఇవ్వాల్సినటువంటి కార్యక్రమం ఇంకా ఉందన్నారు.
ఎరువులు ఎక్కడా కూడా ఇబ్బంది లేదని కలెక్టర్ ప్రతి రోజు తెల్లవారి మొట్టమొదట ఈ జిల్లాలో చేసే కార్యక్రమం ఒకటి సాగునీరు సరిగ్గా అందుతుందా, ఎరువులు ఎలాగ ఉన్నాయని ప్రతి రోజు జిల్లా నలుమూలల నుంచి ప్రతి ఒక్క రైతాంగం నుంచి కూడా ఆయన రైతుల నుండి అభిప్రాయం సేకరణ చేస్తున్నట్టు చెప్పారు. మీ మీ గ్రామాల్లో ఎరువుల సమస్యలు ఉంటే చెప్పండి, ఆయన కూడా ఇక్కడున్నారు కాబట్టి పరిశీలన చేసి ఎరువులఎక్కడా కొరత లేకుండా చూసుకునే బాధ్యత ఈ కూటమి ప్రభుత్వానిదన్నారు. రైతులందరికీ కూడా తెలియజేస్తున్నాం. విత్తనాలు గాని, ఎరువులు గాని, మళ్ళీ రేపు మనమందరం చక్కగా పంట పండించుకొని కొనుగోలు చేసి, మళ్ళీ మీ అందరికీ 48 గంటల్లో రైతు అకౌంట్లలో డబ్బులు వేయించే బాధ్యత ఈ కూటమి ప్రభుత్వానిదన్నారు.
నీటి సరఫరా మరియు పలాస ప్రాంతం: ఎల్.ఎమ్.సి మీదుగా వచ్చే వంశధార నీటి కోసం గతంలో పలాస ప్రాంత రైతులు నీరు రావడం లేదని అనేకసార్లు ధర్నాలు, దీక్షలు చేయాల్సి వచ్చేదన్నారు.
ప్రభుత్వ హయాంలో మార్పు: ప్రస్తుత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది మూడవ సీజన్ అని, సీజన్ వచ్చిన ప్రతిసారీ ఎలాంటి ఇబ్బంది లేకుండా మొట్టమొదటగా పలాసకే నీరు అందించడం జరుగుతోందన్నారు. జిల్లాకు చెందిన, అచ్చెన్నాయుడు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండటం జిల్లాకు ఒక అదృష్టమని, ఆయన మన జిల్లా సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టారని తెలిపారు. రైతులకు భరోసా: వ్యవసాయానికి సంబంధించి ఏ నిర్ణయం తీసుకున్నా జిల్లా రైతులకు ఇబ్బంది లేకుండా చూసుకుంటారని, అది ఎప్పుడూ శ్రీరామ రక్షలా పని చేస్తుందని చెప్తూ, రైతులకు ఎక్కడా నష్టం జరగకుండా చూసుకునే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలు కృషి చేస్తున్నారు.
ఈ రెండు సంవత్సరాల్లో సుమారు కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులు పూర్తి చేశామని, ప్రజల అవసరాలను గుర్తించి, ప్రణాళికాబద్ధంగా అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాల ఫలితమేనన్నారు
