శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా ప్రత్యేక పూజలు

నందికొట్కూర్, ఆంధ్రప్రభ ; పగిడ్యాల మండలం నెహ్రు నగర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో శనివారం భక్తులు, ప్రముఖులు పెద్దఎత్తున పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టిడిపి సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే అభ్యర్థి బండి జయరాజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఆపదలను తొలగించి భక్తులకు అభయమిచ్చే ఆంజనేయ స్వామి వారి ఈ నూతన ఆలయం గ్రామ ప్రజల భక్తికి కేంద్రంగా మారింది అని తెలిపారు.

స్వామివారి దర్శనంతో మనసుకు శాంతి, ధైర్యం లభిస్తాయని భక్తులు విశ్వాసం వ్యక్తం చేశారు.ఆలయ ప్రాంగణం భజనలు, నామస్మరణతో మారుమోగింది అని అన్నారు. స్వామివారి ఆశీస్సులు ఊరిలోని ప్రజలందరికీ కలగాలని అందరూ కోరుకున్నారు.ఈ కార్యక్రమానికి టిడిపి మాజీ ఎమ్మెల్యే అభ్యర్థి బండి జయరాజ్ ముఖ్య అతిథిగా హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. వారితో పాటు బాలవీరయ్య పెద్దలు కాశిరాజు హేమ సుందర్ రాజు గంజాయి గోపాల్ నాగరాజు ఇమ్మడి రవి చౌదరి మరియు గ్రామ పెద్దలు, యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply