56. తవాపర్ణే కర్ణే జపనయనపైశున్యచకితాః
నిలీయంతేతోయే నియత మనిమేషాశ్శఫరికాః
ఇయంచ శ్రీ ర్బద్ధచ్ఛదపుట కవాటం కువలయం
జహాతి ప్రత్యూషే నిశిచవిఘటయ్యప్రవిశతి.
తాత్పర్యం: అమ్మా! అపర్ణాదేవి ! నీ కన్నులు తాము చూసిన రహస్యాన్ని చెప్పటానికి ఎప్పుడూ నీ చెవుల దగ్గరనే ఉండటం చూసి, ఆడు బేడిశ చేపలు భయపడి కంటి మీద రెప్ప వెయ్యకుండా నీళ్ళలో దాక్కుంటున్నాయి. నీ నేత్రసౌభాగ్య లక్ష్మిని చూసిన నల్లకలువలు సిగ్గుపడి పగలంతా తమ అందాన్ని రేకులలో ముడుచుకుని, దాచి, రాత్రి సమయంలో రేకులతలుపులనితెఱచి తమ అందాన్ని బయట పెట్టటానికి సాహసిస్తున్నాయి.
- డాక్టర్ అనంతలక్ష్మి