35.మనస్త్వంవ్యోమత్వంమరుదసిమరుత్సారధిరసి
త్వమాపస్త్వమ్భూమిస్త్వయిపరిణతాయాం న హి పరం
త్వమేవస్వాత్మానంపరిణమయితుంవిశ్వవపుషా
చిదానందాకారంశివయువతిభావేనబిభృషే.
తాత్పర్యం: శివుని ప్రియురాలవైన జగన్మాతా! ఆజ్ఞాచక్రమందున్న మనస్తత్వం, విశుద్ధిచక్రమందున్న ఆకాశతత్త్వం, అనాహత చక్రమందున్న వాయుతత్త్వం, స్వాధిష్ఠాన చక్రమందున్నఅగ్నితత్త్వం, మణిపూర చక్రమందున్నజలతత్త్వం, మూలాధార చక్రమందున్నభూతత్త్వం నీవే. పంచభూతాలు నీవే అయి ఉన్నప్పుడు నీకంటేఇతరమైనపదార్థం మరొకటి కొంచెం కూడా లేదు. నీ స్వరూపాన్ని విశ్వంగా పరిణమింప చేయటానికి చిచ్ఛక్తియుతుడైనఆనందభైరవుని స్వరూపాన్ని అంటే శివతత్త్వాన్ని నీ చిత్తంలో ధరిస్తున్నావు.
- డాక్టర్ అనంతలక్ష్మి