పెళ్లి అప్పులు తీర్చలేక యువకుడి ఆత్మహత్య
- చిత్తూరు జిల్లాలో విషాద ఘటన
రేణిగుంట, ఆంధ్రప్రభ: వివాహ సమయంలో చేసిన అప్పులు తీర్చలేక మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది.
పోలీసుల వివరాల ప్రకారం.. తవణంపల్లి మండలం ముత్తరపల్లికి చెందిన కె. చిరంజీవి (24) రేణిగుంట పోలీస్స్టేషన్ పరిధిలోని వెంకటాపురం సమీపంలో ఇటుకల తయారీ కేంద్రంలో కూలీగా పనిచేస్తున్నాడు.
ఇటీవల జరిగిన వివాహ సమయంలో సుమారు రూ.4 లక్షల వరకు అప్పులు చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆ అప్పులు తీర్చే మార్గం కనిపించకపోవడంతో చిరంజీవి తీవ్ర మనస్తాపానికి గురైనట్లు పేర్కొన్నారు.
ఈ క్రమంలో అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనపై భార్య ఫిర్యాదు మేరకు రేణిగుంట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

