గుండెపోటుతో ఉపాధి హామీ మహిళా మృతి..
కోదాడ అర్బన్, ఆంధ్రప్రభ : కోదాడ మండల పరిధిలోని నల్లబండగూడెం గ్రామానికి చెందిన వేముల పుల్లమ్మ భర్త వెంకటేశ్వర్లు శుక్రవారం ఉదయం ఉపాధి హామీ పనులు చేస్తుండగా గుండెపోటుతో మృతి చెందారు.
సహచర కూలీల సమాచారం మేరకు, పనులు నిర్వహిస్తున్న సమయంలో ఆయన ఒక్కసారిగా అస్వస్థతకు గురై కుప్పకూలిపోయారు. అక్కడే ఆయన మృతి చెందినట్లు తెలిపారు.
వెంకటేశ్వర్ల ఆకస్మిక మృతితో ఉపాధి హామీ కూలీలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులు, గ్రామస్థులు విషాదంలో మునిగిపోయారు.
సమాచారం అందుకున్న మండల అభివృద్ధి అధికారి ఇసాక్ హుస్సేన్ సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు.
