పూర్వ విద్యార్థుల చేయూత..

  • పాఠశాలకు రూ.50 లక్షల అభివృద్ధి పనులు
  • మౌలిక సదుపాయాల కల్పనకు 1975-76 బ్యాచ్‌ హామీ

విజయవాడ, ఆంధ్రప్రభ : పటమట కోనేరు బసవయ్య చౌదరి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలకు కావలసిన మౌళిక సదుపాయాలు కల్పించనున్నట్టు 1975-76 సంవత్సరపు పూర్వ విద్యార్థులు హామీ ఇచ్చారు.పాఠశాల పూర్వ విదార్థి ఎన్ ఆర్ ఐ కోనేరు. కుమార్ నేతృత్వం లో ఆదివారం పాఠశాలను సందర్శించారు.ఈ సందర్భం గా పాఠశాలకు కావలసిన మౌళిక సదుపాయాలు గురించి ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు..భోజనశాల,ఆడిటోరియం, గ్రౌండ్ చుట్టూ ఫెన్సింగ్, వాచ్ మెన్ రూమ్ నిర్మాణం తదితర అంశాలు చర్చించారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలకు సుమారు 50 లక్షలకు పైగా వ్యయం అవుతుందని అంచనా వేశారు.

ఎంత వ్యయం అయినా త్వరత గతిన ఈ నిర్మాణాలు చేపట్టి అందజేస్తామని హామీ ఇచ్చారు. అదే విధంగా పాఠశాలలో జరిగే క్రీడా కార్యక్రమాలు అడిగి తెలుసుకుని విద్యార్థుల క్రీడాభివుద్ధి పట్ల హర్షం వ్యక్తం చేశారు.అనంతరం పాఠశాల ఉపాధ్యాయులు,విద్యార్థులు వీరిని ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వి వి ఎస్ సత్యనారాయణ,ఉపాధ్యాయులు ఎస్.రమేష్, ఆర్.రామారావు, గోపాలకృష్ణ ఎస్ ఎం సీ చైర్మన్ ఎం డి పైగురున్నిస పూర్వ విద్యార్థులు సిహెచ్ వెంకటేశ్వరరావు, కె .వీరాజి అన్నే విష్ణు తదితరులు పాల్గొన్నారు.