సుజనా ఫౌండేషన్ ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన
చిట్టినగర్, ఆంధ్రప్రభ : పేద, మధ్యతరగతి ప్రజల ఆరోగ్య సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆధ్వర్యంలోని సుజనా ఫౌండేషన్ నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాలకు విశేష స్పందన లభిస్తోంది. ప్రతి శని, ఆదివారాల్లో నిర్వహిస్తున్న ఈ వైద్య శిబిరాల్లో భాగంగా ఆదివారం 47వ డివిజన్ సర్కిల్ వన్ కార్యాలయం వద్ద శిబిరాన్ని ఏర్పాటు చేశారు. స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని వైద్య సేవలను సద్వినియోగం చేసుకున్నారు.

ఈ వైద్య శిబిరంలో కంటి పరీక్షలు, ఈసీజీ, 2డీ ఎకో, ఎక్స్‌రే, బీపీ, షుగర్ వంటి రక్త పరీక్షలతో పాటు జనరల్ ఫిజీషియన్ల ద్వారా వైద్య సేవలు అందించారు. కార్పొరేట్ వైద్య సేవలను పేదలకు ఉచితంగా అందించాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే సుజనా చౌదరి ఈ శిబిరాలను నిర్వహిస్తున్నారని నిర్వాహకులు తెలిపారు.
ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగిన ఈ శిబిరంలో 103 మందికి నిపుణులైన వైద్యుల బృందం ప్రత్యేక శ్రద్ధతో వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో ఎన్డీయే కూటమి నేతలు నాగోతి రామారావు, వెంపలి గౌరీ శంకర్, ఆకారపు విజయకుమారి, పోతినీడి లోకేష్, పగిడిపల్లి ప్రభు చరణ్, చొక్కర పాపారావు, కోటేశ్వరరావు, అమరావతి ఐ హాస్పిటల్ వైద్యులు, పీవీఆర్ హాస్పిటల్స్ వైద్యులు, సుజనా ఫౌండేషన్ సిబ్బంది, సుజనా మిత్ర కోఆర్డినేటర్లు పాల్గొని సేవలందించారు.
