2026exam | నీట్ లీకేజీతో విద్యార్థుల్లో ఆందోళన

2026exam | నీట్ లీకేజీతో విద్యార్థుల్లో ఆందోళన

2026exam | నీట్ యూజీ-2026 పరీక్ష రద్దుతో విద్యార్థుల్లో భయం
పేపర్ లీకేజీతో లక్షలాది మంది విద్యార్థుల భవితవ్యంపై ప్రభావం
రీ-టెస్టుల భారం.. మానసిక ఒత్తిడిలో అభ్యర్థులు
విద్యా వ్యవస్థలో పారదర్శకతపై తల్లిదండ్రుల ప్రశ్నలు
లీకు వీరులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్

2026exam | ఆంధ్రప్రభ, వెబ్‌ డెస్క్‌ : పరీక్ష రాయడం ఒక ఎతైతే, పరీక్ష సక్రమంగా జరుగుతుందో లేదో అని భయపడటం ఇప్పుడు మరో ఎత్తుగా మారింది. కంటి మీద రెప్పవేయకుండా రేయింబవళ్లు కష్టపడి చదివిన విద్యార్థుల కష్టానికి విలువ లేకుండాపోతుంది. కొందరు తమ స్వార్థ ప్రయోజనాల కోసం విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తున్నారు. దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ యూజీ-2026 పరీక్షను రద్దు చేస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించడంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. ఎంతో మంది విద్యార్థుల భవితవ్యాన్ని ప్రశ్నార్థకంగా మార్చింది.

విద్యార్థుల కలలకు గ్రహణం..
పేపర్ లీకేజీ వార్తలు విద్యార్థుల, వారి కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. రేయింబవళ్లు కష్టపడి డాక్టర్ కావాలనే ఆశతో పరీక్ష రాసిన లక్షలాది మంది విద్యార్థులకు ఈ లీకేజీలు శాపంగా మారాయి. ప్రశ్నపత్రం లీకేజీ, పరీక్షల రద్దు, రీ-టెస్టుల కారణంగా విద్యార్థులు తీవ్రమైన మానసిక ఆందోళనకు గురవుతున్నారు. వ్యవస్థలోని లోపాలు రేపటి పౌరుల నమ్మకాన్ని దెబ్బతీస్తున్నాయని, లీకు వీరులపై అత్యంత కఠినమైన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

విద్యా వ్యవస్థలో పారదర్శకత లోపించడం వల్ల నిజాయితీగా చదివే విద్యార్థులు బలికావాల్సి వస్తోంది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని, విద్యార్థులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. నిజాయితీగా కష్టపడి చదివే విద్యార్థులకు న్యాయం జరగాలంటే, ప్రభుత్వం ఈ కేసులో నిందితులను కఠినంగా శిక్షించడమే కాకుండా, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సి ఉంది.

CLICK HERE TO READ under30yrs age | ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేదీ మే 26

CLICK HERE TO READ MORE