Panchayat | కోడ్ కూసింది..

- పోటీరాయుళ్ల హోరాహోరి మంతనాలు
- కులానికి ఒకటి, నోటుకు ఒకటి ఓటు వద్దు
- అన్ని వర్గాలను సమాన దష్టితో చూసేవాడికి ఓటు
- ఆడంబరాలు అవినీతితో దడుముకునే ముసుగు దొంగలకు ఓటు వద్దు
- సాధారణ సర్పంచి ఎన్నికలా కారాదు
- ఇది గ్రామ భవిష్యత్తుకు ఎంపిక జరగాలి అంటున్న ప్రజలు
కొందుర్గు, (ఆంధ్రప్రభ) : గ్రామీణ ప్రజాస్వామ్యం మరోసారి తన భవిష్యత్తు నిర్ణయితలను ఎంపికల ఎన్నిక రణరంగానికి సిద్దమైంది. పంచాయతీ కోడు కూసిన క్షణం నుంచి గ్రామాల్లో ఎన్నికల గాలులు తీవ్రంగా వీచుతున్నాయి. పోటీ రాయుళ్లు తమ తమ వర్గాలను సమీకరించుకునే పనిలో నిమగ్నమై పోతున్నారు.
కానీ గ్రామ ప్రజలు మాత్రం ఈ సారి విభిన్న ధో ణిని ప్రదర్శించే అవకాశాలు ఎక్కవగా ఉన్నాయని ఆయా పార్టీ సీనియర్ నాయకులు అంచనా వేస్తున్నారు. ఎన్నికల వేడి మొదలైన ప్రతి ఇంటి ముందు ఒకే చర్చ కులానికి ఒకటి, నోటుకు ఒకటి వద్దు. కుల రాజకీయల పేరుతో గ్రామాన్ని విడదీసే నాయకులకు ఇక మోసపోకూడదన్న అవగాహన జనాలలో సృష్టంగా కనిపిస్తుంది.
మాటల్లో సమానత్వం చెప్పి.. చేతల్లో వర్గ పక్షపాతం చూపే వారిని ఈ సారి పక్కన పెట్టాలని నిర్ణయం తీసుకుంటున్న రాని ఆయా గ్రామాల్లో ఆ నోట ఈ నోట జనుల వాక్కులు వినిపిస్తున్నాయి. గ్రామంలోని పెద్దలు, మహిళలు, యువతలు వర్గబేదం లేకుండా మరో మాట లేకుండా గట్టిగా ఒకే మాటలు అనిపిస్తున్నాయి.
అభివృద్ది అందరికి సమానంగా చేరాలంటే నాయకుడు నిజాయితి గలవాడై ఉండాలని , ప్రజలు కోరుతున్నారు. ఇక మరోవైపు ఎన్నికల సమయంలో తటస్థంగా కనిపిస్తూ, అధికారం లోకి వెళ్లిన తర్వాత ఆడంబరాలు , అవినితి వాసనతో నిండి పోయే ముసుగు దొంగలకు ఓటు వద్దు అని యువజనాలు శక్తివంతమైన పిలుపునిస్తున్నారు.
ప్రజా ధనం దుర్వినియోగం చేసిన నాయకుల గతాన్ని పరిశీలించి , ఈ సారి తప్పకుండా జాగ్రత్త పడతామని చెబుతున్నారు. ఇలా ఇది సాధారణ సర్పంచ్ ఎన్నిక కాకూడదు. గ్రామ భవిష్యత్తు నిర్ణయించే ఎన్నిక కావలి. అంటూ గ్రామస్థులు సృష్టమైన అవగాహనతో ముందుకు సాగుతున్నారు.
వచ్చే ఐదెళ్లలో గ్రామం ఏ దిశగా పయనించాలి? అభివృద్దికి ఏ నాయకుడు పనికి వస్తాడు ? అనే విషయాలను లోతుగా ఆలోచించి ఓటు వేయాలని సామూహిక చైతన్యం పెరిగింది అనడంలో అతిశ యోక్తి లేదని, విశ్లేషకులు గట్టి నమ్మకంగా భావిస్తున్నారు. గ్రామాల్లో ఇలాంటి చైతన్యం పెరగడం ప్రజాస్వామ్యానికి ఆరోగ్యకరమైన సూచికగా భావిసున్నారు ఆయా గ్రామాల్లోని స్థానిక విశ్లేషకులు. ఈ సారి గ్రామ ప్రజల నిర్ణయమే అసలు ఫలితాలను నిర్ణయించబోతోందన్నది అని సృష్టమవుతుంది. ఏదిఏమైనస్థానిక ఎన్నికల్లో గ్రామాల కాలమే నిర్ణయిస్తుంది. వేచి చూడాల్సిందే అని విశ్లేషకులు భావిస్తున్నారు.
