Sangareddy ఖైదీలకు న్యాయసహాయం అందిస్తాం

Sangareddy ఖైదీలకు న్యాయసహాయం అందిస్తాం

  • సెంట్రల్ జైలును ఆకస్మికంగా తనిఖీ చేసిన న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి బి. సౌజన్య

సంగారెడ్డి( Sangareddy), ఆంధ్రప్రభ:

ఖైదీలకు అవసరమైన న్యాయసహాయం అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. సౌజన్య తెలిపారు.

జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ హైదరాబాద్ ఆదేశాల మేరకు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి సూచనలతో బుధవారం కందిలోని సెంట్రల్ జైలును ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు.

తనిఖీ సందర్భంగా బ్యారక్‌లు, ఖైదీల గదులు, వంటగది, బాత్రూమ్‌లు, జైలు ఆవరణ మొత్తం పరిశీలించారు. ఖైదీలను కలిసి వారికి అందుతున్న సౌకర్యాలు, భోజన నాణ్యతపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

జైలు బ్యారక్‌లను క్షుణ్ణంగా పరిశీలించి, ఖైదీలకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని జైలు సూపరింటెండెంట్‌కు సూచించారు. అలాగే ఖైదీలకు సమయానికి బెయిల్, ములాఖత్ సౌకర్యాలు అందుతున్నాయా అని ఆరా తీశారు.

కేసులు త్వరగా పరిష్కారమయ్యేలా ఉచిత న్యాయవాద సేవలు అందిస్తామని ఖైదీలకు తెలియజేశారు. జైలులో ఉన్న లీగల్ ఎయిడ్ క్లినిక్‌ను కూడా పరిశీలించారు.

ఈ తనిఖీలో జైలర్ సత్తయ్య, సుధీర్ కుమార్, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ పాల్గొన్నారు.

Leave a Reply