ఘనంగా మాజీ మంత్రి పువ్వాడ జన్మదిన వేడుకలు

ఖమ్మం సిటీ, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి, ఖమ్మం మాజీ ఎంఎల్ఎ పువ్వాడ అజయ్ కుమార్ జన్మదిన వేడుకలు ఖమ్మం నగరంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా నగరంలోని మామిళ్ళగూడెం 45 వ డివిజన్ లో సాయి బాబా గుడి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం జన్మదిన కేక్ ను కట్ చేసారు.

45వ డివిజన్ కార్పొరేటర్ బుడిగం శ్రీనివాస రావు, బీ ఆర్ ఎస్ రెండవ పట్టణ అధ్యక్షులు, మాజీ కౌన్సిలర్ జక్కుల లక్ష్మయ్య మాట్లాడుతూ.. పువ్వాడ అజయ్ కుమార్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని, రానున్న రోజుల్లో మళ్ళీ ఖమ్మం ప్రజల ఆశీస్సులతో ఎమ్మెల్యే గా గెలిచి మంత్రి పదవి చేపట్టాలని వారు ఆకాంక్షించారు. ఖమ్మం అసెంబ్లీ నియోజక వర్గాన్ని గతంలో ఎవరు చేయనంత అభివృద్ధి కేవలం ఐదెండ్లలో చేసి చూపించారాని వారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు జక్కుల వెంకటరమణ, మిల్లు శ్రీనివాసరావు,(కంబాల శ్రీనివాస్ )తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply