శివచరణ్రెడ్డిపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదు..
చిట్యాల, ఆంధ్రప్రభ : యాదగిరిగుట్ట దేవస్థానం పాలక మండలి సభ్యురాలు పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జెక్కిడి శివచరణ్రెడ్డిపై కేసు నమోదు చేయాలని కోరుతూ మంగళవారం చిట్యాల యాదవ సంఘం ఆధ్వర్యంలో స్థానిక సీఐకి ఫిర్యాదు చేశారు.
ఈశ్వరమ్మను అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా బీసీ మహిళను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ, శివచరణ్రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
