mla’s | ప్రభుత్వ ఏర్పాటుకు కసరత్తు వేగం

mla’s | ప్రభుత్వ ఏర్పాటుకు కసరత్తు వేగం

mla’s | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీవీకే అధినేత విజయ్‌ లోక్‌భవన్‌లో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌ను కలుసుకుని ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించారు.

తమిళనాడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ 108 స్థానాల్లో విజయం సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఇంకా 10మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం కావడంతో విజయ్‌ కసరత్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో గవర్నర్ ఆహ్వానం మేరకు ఆయనను కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలపై చర్చించినట్లు సమాచారం.

ఇక టీవీకేతో కాంగ్రెస్‌ పొత్తు ఖరారు కావడంతో విజయ్‌ శిబిరంలో ఉత్సాహం నెలకొంది. ఇతర పార్టీల అసంతృప్త ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టే దిశగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. తదుపరి రాజకీయ పరిణామాలు ఎలా మలుపుతిప్పుతాయన్నది ఆసక్తికరంగా మారింది.