Roads | ఒకటవ వార్డు అభివృద్ధే నా లక్ష్యం…

Roads | ఒకటవ వార్డు అభివృద్ధే నా లక్ష్యం…
- ప్రజల ఆశీస్సులే నా బలం..అందరికీ అందుబాటులో ఉంటా..
- వార్డులోని ప్రతి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతాను
- ఉత్తమ వార్డు కోసం నిజాయితీగా పని చేస్తాను.
- కాంగ్రెస్ పార్టీ నుంచి కౌన్సిలర్‌గా బరిలో సింగపురం దయాకర్
Roads | స్టేషన్ ఘన్‌పూర్, ఆంధ్రప్రభ : స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపాలిటీలోని ఒకటో వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సింగపురం దయాకర్ కౌన్సిలర్ ఎన్నికల బరిలో ఉన్నారు. రాజకీయ అనుభవం కలిగిన నాయకుడిగా..స్థానిక సమస్యలపై పూర్తి పట్టున్న వ్యక్తిగా ఆయనకు ప్రజల్లో మంచి గుర్తింపు ఉంది. ఎన్నో ఏళ్లు గా ప్రజలతో మమేకమై పనిచేస్తూ..తాగునీరు, డ్రైనేజీ, రహదారులు, పారిశుధ్యం వంటి మౌలిక సమస్యలపై లోతైన అవగాహనతో ముందు కు సాగుతున్న నాయకుడు దయాకర్..సమస్య ఎక్కడ ఉందో చెప్పా ల్సిన అవసరం లేకుండా, ప్రజల కష్టాలు ముందే తెలుసుకుని స్పందించే నేతగా ఆయనకు పేరుంది. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ అనుభవంతో కూడిన రాజకీయం, సేవాభావంతో కూడిన నాయకత్వం దయాకర్ ప్రత్యేకతగా నిలుస్తుందని పలువురు చెబుతున్నారు.
-ప్రజలు పిలిస్తే ఆప్యాయంగా పలికే నేతగా:

ప్రజలు పిలిస్తే ఆప్యాయంగా పలికే నేతగా, ప్రతి ఒక్కరి మాట వినే వ్యక్తిగా సింగాపురం దయాకర్ ఇప్పటికే ప్రజల మధ్య మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. కష్టపడే మనిషిగా..సేవనే లక్ష్యంగా రాజకీయా ల్లోకి వచ్చిన ఆయన 1వ వార్డులో ఆశాజనకమైన నాయకుడిగా ప్రజల ముందుకు వస్తున్నారు.
మరోమారు ప్రజలు ఆశీర్వాదం ఇస్తే.. అభివృద్ధి చేసి చూపిస్తాను…

వార్డులో ఉన్న ప్రతి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతానని అభ్యర్థి సింగాపురం దయాకర్ అన్నారు. ఆదివారం వార్డులో నిర్వ హించిన ప్రచారంలో గడపగడపకు ఓటరును గెలిపించాలని కోరా రు.అదే విధంగా వార్డ్ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంత రం దయాకర్ మాట్లాడుతూ..నేను ఎప్పుడూ మీకు అందుబాటులో ఉంటాను. వార్డు కోసం, ప్రజల కోసం పనిచేస్తాను. మీరు నాకు కౌన్సిల ర్‌గా అవకాశం ఇస్తే ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటానని పేర్కొ న్నారు.

ఉత్తమ వార్డు నిర్మాణం కోసం నిజాయితీగా కృషి చేస్తాను. ప్రతి రోజు తాగునీటి సరఫరా సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకుంటాను. వీధి దీపాల నిర్వహణను నిత్యం పర్యవేక్షిస్తాను. గ్రామంలోని ప్రతి వీధికి సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి కృషి చేస్తాను. వృద్ధులు, దివ్యాంగులకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి చేరేలా చూస్తాను. యువతలో ఉన్న క్రీడా ప్రతిభ ను వెలికి తీసేందుకు ప్రత్యేకంగా ప్రోత్సహిస్తాను. ముఖ్యంగా ఎలాంటి పక్షపాతం లేకుండా పారదర్శక పాలన అందిస్తాను. అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా నా వంతు బాధ్యతగా పనిచేస్తాను.

