రోడ్డు ప్రమాదం.. నలుగురికి గాయాలు..

రోడ్డు ప్రమాదం.. నలుగురికి గాయాలు..

మచిలీపట్నం, ఆంధ్రప్రభ : కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని హర్ష కాలేజ్ సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు గాయపడ్డారు. పెడన నుంచి మచిలీపట్నం వైపు వస్తున్న ఓ కారు అదుపుతప్పి ముందుగా వెళ్తున్న ఆటోను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న వారిలో ఒకరికి చేతికి, మరొకరికి కాలికి గాయాలయ్యాయి. కారు ఢీకొట్టిన ప్రభావంతో ఆటో ముందుకు వెళ్లి అదే మార్గంలో వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టడంతో బైక్‌ పై ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళలు కూడా గాయపడ్డారు.

ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో మచిలీపట్నం–పెడన ప్రధాన రహదారి పై కొంతసేపు ట్రాఫిక్ స్తంభించింది. వాహనాలు భారీగా నిలిచిపోవడంతో మరో రెండు కార్లు కూడా ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.