Prabhas | రాజమౌళి నెక్ట్స్ ఇదేనా..?
Prabhas | రాజమౌళి నెక్ట్స్ ఇదేనా..?
Prabhas | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : బాహుబలి మూవీ ఓ సంచలనం. ఇంకా చెప్పాలంటే.. బాహుబలి ఓ చరిత్ర. ఒక కథను రెండు భాగాలుగా చెప్పచ్చు.. అలా చెప్పడం ద్వారా బ్లాక్ బస్టర్ సాధించవచ్చు అని నిరూపించింది. దీంతో సీక్వెల్స్ ట్రెండ్ ఊపందుకుంది. స్టార్ హీరోలే కాదు.. మీడియం రేంజ్ హీరోలు కూడా సీక్వెల్స్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే.. బాహుబలి ఎంతటి ప్రభావం చూపించిందో అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే.. ఊహించని విధంగా ప్రభాస్, రానా, అనుష్క.. బాహుబలి 3 ఉందని అనౌన్స్ చేశారు. మరి.. రాజమౌళి నెక్ట్స్ మూవీ ఇదేనా…?

సర్ ఫ్రైజ్ అనౌన్స్ మెంట్..
బాహుబలి ది టార్చ్ బేరర్ నెట్ ఫ్లిక్స్ వేదికగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ స్పెషల్ డాక్యుమెంటరీ సినిమా తారాగణపు ముచ్చట్లుతో వచ్చింది. బాహుబలి ది టార్చ్ బేరర్ నాలుగు ఎపిసోడ్స్ సిరీస్ గా వచ్చింది. ఇందులో ప్రభాస్, రానా, అనుష్క, సత్యరాజ్ తదితరులు బాహుబలి గురించి ఆసక్తికర విషయాలను బయటపెట్టారు. అయితే.. ప్రభాస్, రానా, అనుష్క కలిసి మాట్లాడుతూ.. బాహుబలి లెగసి ఆగలేదు.. బాహుబలి పార్ట్ 3 ఉందని అనౌన్స్ చేశారు. ఇలాంటి అనౌన్స్ మెంట్ వస్తుందని ఎవరూ ఊహించలేదు. దీంతో ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

అంతకు మించి అనేలా..
దర్శకధీరుడు రాజమౌళి గతంలో బాహులి 3 ఉంటుందని చెప్పారు. ఇప్పుడు ప్రభాస్, రానా, అనుష్క అనౌన్స్ చేయడంతో.. జక్కన్న ప్లానింగ్ మామూలుగా ఉండదు అంటూ కామెంట్లు పెడుతున్నారు. అంతే కాకుండా.. బాహుబలి 2 పార్టులుతో చరిత్ర సృష్టించిన రాజమౌళి ఈసారి బాహుబలి 3తో చరిత్ర తిరగరాస్తారని.. అంతకు మించి అనేట్టుగా ఉంటుందని నెటిజన్లు కామెంట్లు పెడుతుండడం ఆసక్తిగా మారింది. ప్రస్తుతం రాజమౌళి వారణాసి మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ భారీ, క్రేజీ పాన్ వరల్డ్ మూవీని నెక్ట్స్ ఇయర్ ఏప్రిల్ 7న వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. అయితే.. వారణాసి తర్వాత రాజమౌళి బాహుబలి 3 స్టార్ట్ చేస్తారా..? లేక కొంత గ్యాప్ తర్వాత బాహుబలి 3 పట్టాలెక్కిస్తారా..? అనేది తెలియాల్సివుంది.

