కబలించిన మృత్యువు…
విద్యుత్ షాక్ తో ముగ్గురు మృతి..
ఒకే కుటుంబంలో విగత జీవులుగా ముగ్గురు…
భర్త, భార్య, సోదరి మృతి….
మృతుల స్వస్థలం రాజమహేంద్రవరం….
విజయవాడలో తీవ్ర విషాదం….
ఘటనా స్థలాన్ని పరిశీలించిన ప్రజా ప్రతినిధులు…
(ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో) వెంటాడిన మృత్యువు ఒకే కుటుంబంలోని ముగ్గురిని కబలించింది. అప్పటివరకు సరదా కబుర్లతో కుటుంబ విషయాలు చర్చించుకుంటూ ఆనందంగా గడుపుతున్న ఆ కుటుంబంలో జరిగిన హఠాత్పరాణామంతో ముగ్గురు విగత జీవులుగా మారారు. విజయవాడలోని బెంజ్ సర్కిల్ సమీపంలో ఉన్న నారా చంద్రబాబునాయుడు కాలనీలోని ఒక ఇంటిలో జరిగిన విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృత్యువాత పడ్డారు. రాజమండ్రి ప్రాంతానికి చెందిన సలాది ప్రసాదు (61), భార్య సలాది వెంకట హేమ వాణి (54) ఆయన సోదరి టీ ముత్యావల్లి (55) శనివారం ఉదయం జరిగిన విద్యుత్ ఘాతకంలో మరణించారు.
మొదటిగా ఒకరికి షార్ట్ సర్క్యూట్ జరగకగా ఒకరిని కాపాడేందుకు మరొకరు మరొకరిని కాపాడు ఎందుకు ఇంకొకరు ప్రయత్నించి ముగ్గురు మరణించడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదఛాయలు నింపాయి. శనివారం ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో జరిగిన విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ముగ్గురు మృత్యువాత పడటం, అరుపులు కేకలను గమనించి చుట్టుపక్కల వారు సమాచారాన్ని పోలీసులు, విద్యుత్ అగ్నిమాపక శాఖ కు సమాచారం ఇవ్వడంతో, హుటా హుటిన అక్కడికి చేరుకున్న అధికారుల సిబ్బంది మొదటిగా విద్యుత్ సరఫరాను నిలుపుదల చేశారు. అనంతరం ఆ ప్రాంతంలో పరిశీలించగా ముగ్గురు వ్యగత జీవులుగా పడి ఉన్నారు. మృతుల వివరాలు సేకరించిన అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు సంఘటనకు గల కారణాలపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
పరిశీలించిన ప్రజాప్రతినిధులు..

విజయవాడలో బెంజ్ సర్కిల్ సమీపంలో ఒక ఇంటిలో జరిగిన విద్యుత్ ఘాతకంతో ముగ్గురు మరణించడంతో తూర్పు నియోజకవర్గ శాసనసభ్యుడు గద్దె రామ్మోహన్రావు సంఘటన స్థలాన్ని ఇంటిని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను, అందుతున్న సహాయక చర్యలను, పోస్టుమార్టం కోసం మృతదేహాల తరలింపు వంటి అంశాలపై అక్కడ ఉన్న అధికారులతో చర్చించారు. వైసిపి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు, తూర్పు నియోజకవర్గ ఇన్చార్జి దేవినేని అవినాష్ కూడా సంఘటన జరిగిన ఇంటిని సందర్శించి అధికారుల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
