Rice Mill | వెంట‌నే ధాన్యం అన్ లోడింగ్‌…

Rice Mill | వెంట‌నే ధాన్యం అన్ లోడింగ్‌…

Nizamabad | బిక్కనూర్, ఆంధ్రప్రభ : వరి ధాన్యం అన్ లోడింగ్(Unloading) చేయడంలో రైస్ మిల్ యజమానులు ఇబ్బందులకు గురి చేయవద్దని కాంగ్రెస్ నాయకులు సూచించారు. ఈ రోజు కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో ఉన్న‌ వరి ధాన్యం బస్తాలను వారు పరిశీలించారు.

అనంతరం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఇంద్రకరణ్ రెడ్డి(Indrakaran Reddy) మాట్లాడుతూ.. వరి ధాన్యం లోడింగ్ తో రైస్ మిల్లు(Rice Mill)కు వెళ్లిన లారీలు అన్‌లోడింగ్ ఆలస్యం అవ్వడం వల్ల రైతులకు ఇబ్బందులు కలుగుతున్నాయని చెప్పారు. కొంతమంది రైస్ మిల్ యజమానులు(Mill Owners) సన్న వరి ధాన్యానికి ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. రెండు మూడు రోజుల్లోగా లారీలు(Lorries), రైస్ మిల్ వద్ద ఉండటం వల్ల పలు గ్రామాలలో తూకం వేసిన వరి ధాన్యం లోడింగ్ కు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని తెలిపారు.

ఇట్టి విషయంలో రైస్ మిల్ యజమానులు వెనువెంటనే అన్లోడింగ్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు భూమయ్య(Bhumaiya), మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సుదర్శన్, మండల ఎస్సీ సెల్ కాంగ్రెస్ అధ్యక్షుడు జీవన్, నాయకులు నరసింహ రెడ్డి, రమేష్ రెడ్డి, సిద్ధిరాములు, స్వామి తదితరులు ఉన్నారు.

Leave a Reply