Megastar | లండన్ లో చిరంజీవి… యుకె పార్లమెంట్ లో రేపు మెగాస్టార్ కు స‌త్కారం


బాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి సినిమాల గురించి అందరికీ తెలుసు ఆయన సినీ ఇండస్ట్రీకి ఎంతో సేవ చేశారు. స్వయం కృషి తో పైకొచ్చిన ఈయన ఇండస్ట్రీకి ఆదర్శం. ఎంతో మంది హీరో, హీరోయిన్లు ఆయనను ఆదర్శంగా తీసుకుంటున్నారు. చిరు సేవలకు ఎన్నో అవార్డులు వరించాయి. తాజాగా మరో అరుదైన గౌరవం లభించింది.. యూకే ప్రభుత్వం ఆయనకు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును ప్రకటించడంతో అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సినీ రంగంలో దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఆయన చేస్తున్న సేవలకు గానూ.. ఈ పురస్కారం ఆయనను వరించింది. ఆ దేశ పార్లమెంటులో ఈనెల 19వ తేదీన మెగాస్టార్ చిరంజీవికి ఈ అవార్డును బహుకరించనున్నారు.. ఈ అవార్డును అందుకోవడం కోసం చిరంజీవి విమానంలో నేడు లండన్ కు చేరుకున్నారు.. విమానాశ్ర‌యంలో అయ‌న అభిమానులు ఘనస్వాగతం పలికారు. చిరంజీవకి శాలువాలు కప్పి సన్మానించారు. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..

చిరంజీవిని వరించిన అవార్డులు..

ఇండస్ట్రీలోకి ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన చిరంజీవి ఒక్కో సినిమాతో తన టాలెంట్ నిరూపించుకుంటూ మెగాస్టార్ అయ్యాడు.. 9 ఫిలింఫేర్, మూడు నంది అవార్డులతో పాటు అనేక ప్రతిష్టాత్మక అవార్డులు చిరంజీవిని వరించాయి. సినీ రంగానికి చిరంజీవి అందించిన సేవలకు గాను యూకే పార్లమెంట్ ఈ అవార్డు ఇవ్వనుంది. 2006లో చిరంజీవికి పద్మభూషణ్, 2024లో పద్మవిభూషణ్ ను కేంద్రం అందించింది. ఇప్పటివరకు చిరంజీవి 156 చిత్రాల్లో నటించాడు. 537 పాటలు, 24 వేల స్టెప్పులతో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చిరంజీవికి చోటు దక్కింది.. ఈ వయసులో కూడా ఆయన వరుస సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉన్నాడు. కుర్ర హీరోలకు పోటీనిస్తూ డాన్సులతో అదరగొడుతున్నాడు.

రాజకీయాల్లోకి చిరంజీవి..

సినీ రంగంలోనే కాదు, రాజకీయ రంగంలోనూ మంచి మాట ఉంది. ఆయన రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చి ప్రజలకు సేవ చేశాడు. 2009 అసెంబ్లీ ఎన్నికలకు ముందు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని ఏర్పాటు చేశారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ 18 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. కొన్ని రోజుల తర్వాత ప్రజా రాజ్యం పార్టీని కాంగ్రెస్ లో చిరంజీవి విలీనం చేశారు.. దాంతో అప్పటి ప్రధానమంత్రి చిరంజీవిని కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకున్నారు. మంత్రిగా కూడా ఆయన సేవలందించాడు. 2014 తర్వాత చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇటీవల కాలంలో ఆయన ప్రధాని పాల్గొన్న కార్యక్రమాల్లో చిరంజీవి పాల్గొన్నారు. దీని తర్వాత చిరంజీవి మళ్ళీ రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇటీవల ఈ వార్తలు పై చిరంజీవి క్లారిటీ ఇచ్చారు. తను ఎప్పటికీ రాజకీయాల్లోకి రానని సినిమాలకే తన జీవితం అంకితం చేస్తానంటూ చెప్పినట్లు తెలుస్తుంది.. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం డైరెక్టర్ వశిష్ట కాంబినేషన్లో విశ్వంభర సినిమాలో నటిస్తున్నాడు.. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఆ మూవీ ప్రస్తుతం గ్రాఫిక్స్ పనులను పూర్తి చేసుకొనే ప్రయత్నంలో ఉంది. మే 9న ఈ సినిమా రిలీజ్ కాబోతున్నట్లు ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *