ఉపసర్పంచ్‌ల చెక్‌పవర్ రద్దు వార్తలను ఖండించాలి

ఉపసర్పంచ్‌ల చెక్‌పవర్ రద్దు వార్తలను ఖండించాలి

  • బొట్ల కార్తీక్

నల్గొండ, ఆంధ్రప్రభ : చెక్‌పవర్‌ రద్దు పై వస్తున్న వార్తలను వెంటనే ఖండించాలని రాష్ట్ర ఉపసర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు బొట్ల కార్తీక్‌ ప్రభుత్వాన్ని కోరారు.నల్లగొండలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు జోగు నగేష్ ఆధ్వర్యంలో ఈనెల 25న హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద నిర్వహించే హలో ఉప సర్పంచ్.. చలో హైదరాబాద్ కార్యక్రమం పోస్టర్ ఆయన ఆవిష్కరించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉపసర్పంచ్‌ల చెక్‌ పవర్ రద్దు పై వస్తున్న వార్తలను ఖండించి వార్డ్ మెంబర్లకు నెలకు 3వేలు, ఉప సర్పంచ్ లకు 5వేలు గౌరవ వేతనం ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఒకవేళ ప్రభుత్వం ప్రకటించని ఎడల ఈ నెల 25 న ఇందిరా పార్క్ వద్ద ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ధర్నాకు ఉప సర్పంచులు అంత అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షులు గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి మజ్జిగ నరేష్, మట్టా శ్రీనివాస్, కట్టంగూరు మండల అధ్యక్షుడు గోపగాని లింగమ్మ జానయ్య, అయితగోని వెంకటేశం, సతీష్, నవ్య అనిల్ కుమార్ గౌడ్, కడారి కొండల్, నక్క రాజేష్, మర్రి శివ తదితరులున్నారు.