చేనేత దినోత్సవం సందర్భంగా సేవా కార్యక్రమాలు
ఏటూరునాగారం, ఆంధ్రప్రభ: జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏటూరునాగారం మండల పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేయడంతో పాటు పలువురు సంఘ సభ్యులు స్వచ్ఛందంగా రక్తదానం చేసి సామాజిక సేవ పట్ల తమ నిబద్ధతను చాటుకున్నారు.
సంఘం నాయకులు మాట్లాడుతూ చేనేత వృత్తి గొప్పతనాన్ని చాటిచెప్పేలా ప్రతి ఏడాది సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు చిప్ప అశోక్, పోగుల లక్ష్మీనారాయణ, అలువాల శ్రీనివాస్, కందగట్ల వేణు, కందగట్ల శ్రీనివాస్, లోటాపేటల రాజేష్, నూతి ప్రణయ్, చెన్న రాంబాబు, శ్రీరామ్ సురేష్, ఇరుశావడ్ల నాగరాజు, కూరపాటి వేణుగోపాల్, చిరురాల గంగాధర్, కోడం కిరణ్, కోడం మురళి, గుండ్లపల్లి నాగరాజు, గుండ్లపల్లి సత్యం, చామర్తి కిషోర్, వావిలాల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
