వదిలేసిన పేగు బంధం

స్పందించుమా.. మానవత్వమా..

( ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ ) ఎవ్వరో .. ఈ తల్లి. ఆకలి దప్పులతో రోడ్డు పక్కనే.. వానకు తడుస్తూ.. ఎండకు ఎండుతోంది.. ఈ పండుటాకు. తాళి కట్టిన మగడు లేదు. పేగు బంధమూ తెగింది. అందుకే రోడ్డున పడింది. ఎక్కడి నుంచి వచ్చావంటే.. పెదవి విప్పటం లేదు. ఔను తన చిరునామా చెబితే.. మళ్లీ నరకానికే పంపిస్తారని భయం కావొచ్చు.. తన కుటుంబం పరువు పోకూదని కావొచ్చు. ఈ హృదయ విదార దృశ్యం ఎక్కడో కాదు.. గుంటూరు(Guntur) జిల్లా మంగళగిరి(Mangalagiri)లో మానవత్వాన్ని(Humanity) కంటతడి పెట్టిస్తోంది. పాత మంగళగిరి(Mangalagiri) బోసు బొమ్మ సెంటర్ వద్ద ఓ వృద్ధురాలు ధీన స్థితిలో కనిపించింది. చిరునామా అడిగితే సరైన సమాచారం చెప్పలేక పోతోంది. ఈమె వయసు సుమారు 70 ఏళ్లు ఉండొచ్చు. ఈ వృద్ధురాలి కుటుంబ సభ్యులెవరో తెలిస్తే సమాచారం ఇవ్వాలని మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్ కు ఇవ్వాలని ఎస్ఐ రవీంద్ర నాయక్(SI Ravindra Nayak) కోరారు. ఒకటి నిజం మానవత్వం పరిమళించే వరకూ ఇలాంటి అభానీలు అనాథ పండుటాకుల్లా రాలిపోతారు. ప్లీజ్.. సమాజమా స్పందించు.

Leave a Reply