మదుపరులకు ఊరట..

  • ఫ్లాట్‌గా ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు…
  • రాణించిన‌ ఆటో స్టాక్స్.. నష్టాల్లో ఐటీ షేర్లు

(ఆంధ్రప్రభ): దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభనష్టాల ఒడుదొడుకులు ఎదుర్కొని చివరికి ఫ్లాట్గా ముగిశాయి. ఉదయం నష్టాల్లో ప్రారంభమైన సూచీలు, మధ్యాహ్నానంతరం కొంత పుంజుకున్నప్పటికీ, చివరికి స్వల్ప లాభాలతో స్థిరపడ్డాయి.

సెన్సెక్స్ 33,835.10 పాయింట్ల వద్ద ప్రారంభమై (క్రితం ముగింపు 83,938.71) రోజంతా 83,609.54 నుండి 84,127.00 పాయింట్ల మధ్య కదలాడింది. చివరికి 38.78 పాయింట్ల లాభంతో… 83,978.49 వద్ద ముగిసింది.

నిఫ్టీ కూడా 41.25 పాయింట్లు లాభపడి 25,763.35 పాయింట్ల వద్ద స్థిరపడింది.

ప్రైవేట్ బ్యాంకింగ్, ఎఫ్‌ఎంసీజీ స్టాక్స్ సూచీలపై ఒత్తిడి పెంచగా, ప్రభుత్వరంగ బ్యాంకింగ్ షేర్లు, త్రైమాసిక ఫలితాలు, ఆటోమొబైల్ సేల్స్ డేటా దన్నుగా నిలిచాయి. దీంతో మార్కెట్ భారీ నష్టాలను తప్పించుకుంది.

సెన్సెక్స్ 30 సూచీలో మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్, ఎస్బీఐ, భారత్ ఎయిర్‌టెల్ షేర్లు ప్రధాన లాభదారులుగా నిలిచాయి. కాగా మారుతీ సుజుకీ, ఐటీసీ, టీసీఎస్, ఎల్&టి, బీఈఎల్ షేర్లు స్వల్ప నష్టాలను మూటగట్టుకున్నాయి.

డాలరుతో రూపాయి మారకం విలువ 88.77గా కొనసాగింది. అంతర్జాతీయ మార్కెట్లలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 64.70 డాలర్ల వద్ద కొనసాగుతుండగా, బంగారం ఔన్సు 3,998 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

Leave a Reply