గొడ్డలి పోటుకు బ్రాండ్ అంబాసిడర్ జగన్

గొడ్డలి పోటుకు బ్రాండ్ అంబాసిడర్ జగన్
ఎన్టీఆర్ జిల్లా అధికార ప్రతినిధి రేగళ్ల లక్ష్మణ్ రావు
భవానిపురం, మే-22(ఆంధ్రప్రభ) : గొడ్డలిపోటుకు బ్రాండ్ అంబాసిడర్ జగన్ రెడ్డి అని టిడిపి ఎన్టీఆర్ జిల్లా అధికార ప్రతినిధి రేగళ్ల లక్ష్మణ్ రావు ధ్వజమెత్తారు. వైసిపి అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ శుక్రవారం ఆయన కార్యాలయం లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఓటమి ప్రెస్టేషన్లో ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు.సొంత బాబాయ్‌ని ఇంట్లోనే గొడ్డలితో నరికి, ఆపై గుండెపోటు అని కథలల్లిన హిచ్‌కాక్ డైరెక్టర్ జగన్ అని, గునపం, గొడ్డలి, కోడికత్తి, చివరకు శవరాజకీయాల స్క్రిప్ట్ కూడా వైసీపీ ఇదేనని ధ్వజమెత్తారు.చంద్రబాబు వయస్సు 77 ఏళ్లు కావచ్చు కానీ ఆయన విజన్ ముందు నీ 50 ఏళ్ల ఆలోచనలు మోకాళ్లూడాలి” అని స్పష్టం చేశారు. ఈ వయసులో కూడా చంద్రబాబు రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచిస్తుంటే, జగన్ మాత్రం తన ‘ప్యాలెస్’ భవిష్యత్తు కోసం శవరాజకీయాలు ఆలోచిస్తున్నారని విమర్శించారు.
అధికారంలో ఉంటే అరాచకం!అధికారం పోతే ఆక్రందన!ఇదా నీ రాజకీయ పరిణతి అని ప్రశ్నించారు, ఐదేళ్ల పాలనలో వైసిపి కార్యకర్తలు నరరూప రాక్షసుల్లా తిరిగినప్పుడు నోరు మెదపకుండా ఇప్పుడు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది అంటూ ఘాటుగా మండిపడ్డారు.ప్రజలు వైసిపిని ‘ఫ్యాన్’ తో సహా పీకి అవతల పారేసినా ఇంకా బుద్ధి రాలేదని, అబద్ధాల పునాదుల మీద కట్టిన జగన్ సామ్రాజ్యం కూలిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.జగన్ ఎన్ని కుట్రలు చేసినా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయనను శాశ్వతంగా ప్రతిపక్షంలోనే కూర్చోబెడతారని, ఇకనైనా వాస్తవాలు ఒప్పుకుని దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు.
