Raju Yadav | నట్టల నివారణ మందు వేయించాలి

Raju Yadav | నట్టల నివారణ మందు వేయించాలి
- ఇప్పర్తి సర్పంచ్ చీమల రాజు యాదవ్
Raju Yadav | మునుగోడు, ఆంధ్రప్రభ : జీవాలకు తప్పనిసరిగా నట్టల నివారణ మందు వేయించాలని సర్పంచ్ చీమల రాజు యాదవ్ అన్నారు. ఈరోజు నల్లగొండ జిల్లా మునుగోడు మండలం ఇప్పర్తి గ్రామంలో పశువైద్య పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నట్టల నివారణ మందు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు.. గొర్ల, మేకల కాపరులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. గోపాలమిత్ర చెరుకుపల్లి సత్యనారాయణ, గుండాల గోవింద్, బూడిద జంగయ్య, పాసు యాదయ్య, పాసు కృష్ణ , ఈరటి శివ, ఈరటి రాము తదితరులు పాల్గొన్నారు.
