AP | అమ్మవారి సేవలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి..

జస్టిస్‌ తుహిన్‌ కుమార్‌ దంపతులకు ఘన స్వాగతం
వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ దర్శనం
ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం..
ప్రత్యేక పూజలు నిర్వహించిన దంపతులు


AP | (ఆంధ్రప్రభ, ఇంద్రకీలాద్రి) : ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ తుహిన్‌ కుమార్‌ గేదెల తన వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మవారిని దర్శించుకున్నారు. సతీమణితో కలిసి ఆలయానికి విచ్చేసిన జస్టిస్‌ తుహిన్‌ కుమార్‌ దంపతులకు ఆలయ మర్యాదల ప్రకారం అర్చకులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం దంపతులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదపండితులు వేద ఆశీర్వచనం చేయగా, వైదిక కమిటీ సభ్యుడు శంకర శాండిల్య ఆలయ అర్చకులు అమ్మవారి ప్రసాదాలను, చిత్రపటం అందించారు.