Quiz programs | ఘ‌నంగా జాతీయ రైతు దినోత్సవం

Quiz programs | నార్సింగి, ఆంధ్ర‌ప్ర‌భ : మండలంలోని భీoరావుపల్లి గ్రామంలో SM సెహగల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో HDFC బ్యాంక్ పరివర్తన్ కార్యక్రమం సహకారంతో జాతీయ రైతు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతుల అవగాహన కోసం వ్యవసాయం, పంటల నిర్వహణ, మైక్రో న్యూట్రియెంట్స్‌పై క్విజ్ కార్యక్రమాలు నిర్వహించారు. విజేత మాజీ వార్డ్ మెంబర్ బోయినిభూషణంకు నూతన సర్పంచ్ కిష్టజనార్ధన్, ఉప సర్పంచ్ మనోహర్ బహుమతి అందజేశారు. అనంతరం నూతనంగా ఎన్నికైన సర్పంచ్, కిష్ట జనార్ధన్, ఉప సర్పంచ్ మనోహర్ ను సేహగల్ ఫౌండేషన్ అధికారులు మణిదీప్, విజయ కుమారి సన్మానించారు. గ్రామ రైతులు, రైతు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.