మీ మార్ట్‌ల ద్వారా నాణ్యమైన సరుకులు

తక్కువ ధరకే ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నాం: ఎమ్మెల్యే బొండా ఉమా

పాయకాపురం, ఆంధ్రప్రభ: మీ మార్ట్‌ల ద్వారా నాణ్యమైన సరుకులను తక్కువ ధరకే ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నామని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా మీ మార్ట్‌లను ప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఆయన పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా రెండు షాపులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

ఇందులో భాగంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో తొలి విడతగా 60వ డివిజన్ బాంబే కాలనీలోని షాప్ నంబర్‌ 106, 62వ డివిజన్ రాధానగర్‌లోని షాప్ నంబర్‌ 109లను ప్రారంభించనున్నట్లు శుక్రవారం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే బొండా ఉమా వెల్లడించారు. ప్రజలకు నాణ్యమైన నిత్యావసర సరుకులు సరసమైన ధరలకు అందించడమే మీ మార్ట్‌ల లక్ష్యమని ఆయన తెలిపారు.