బీజేపీ వైఖరికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ధర్నా

  • ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు పోరాటం చేస్తాం: ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి

నాగర్‌కర్నూల్, ఆంధ్రప్రభ : జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను అవమానించేలా బీజేపీ వ్యవహరించిన తీరును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో ధర్నా నిర్వహించారు.

శుక్రవారం సాయంత్రం అంబేద్కర్ చౌరస్తా వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి పాల్గొని పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి బీజేపీ వైఖరిపై నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య విలువలను, రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులపై అవమానకర వ్యాఖ్యలు, చర్యలను సహించబోమని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తుందని తెలిపారు.

ఈ నిరసన కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బాదం రమేష్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు వంకేశ్వర్ నిరంజన్, నాయకులు ధర్మరాజు, విజయ్ కుమార్ రెడ్డి, టౌన్ ప్రెసిడెంట్ జక్కా రాజు, నాగర్‌కర్నూల్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కొత్తపల్లి వినోద్ కుమార్, కొత్త శ్రీనివాసులు, కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువజన కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.