జైనూర్ పీఆర్టీయూ–టీఎస్ నూతన కార్యవర్గం ఎన్నిక..
జైనూర్, ఆంధ్రప్రభ : కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పీఆర్టీయూ–టీఎస్ సంఘ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరావు, గౌరవాధ్యక్షులు, సంఘ నాయకులు హాజరయ్యారు.
ఎన్నికల అధికారిగా కెరమెరి మండల అధ్యక్షుడు శివప్రసాద్ వ్యవహరించారు. ఎన్నికల్లో జైనూర్ మండల పీఆర్టీయూ–టీఎస్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
మండల అధ్యక్షుడిగా పుర్క తులసీరామ్, ప్రధాన కార్యదర్శిగా రాథోడ్ మహేందర్, గౌరవ అధ్యక్షుడిగా బి. నరేష్, మహిళా గౌరవ అధ్యక్షురాలిగా అర్చన, ఉపాధ్యక్షుడిగా షెడ్మ రావు, మహిళా ఉపాధ్యక్షురాలిగా రాజ్య ప్రమీల, కార్యదర్శిగా కే. రాజు, మహిళా కార్యదర్శిగా ఆడే సుజాత ఎన్నికయ్యారు.
అనంతరం నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులతో ఎన్నికల అధికారి ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులకు సంఘ నాయకులు అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరావు, రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఆడే ప్రకాష్, జైనూర్, సిర్పూర్ (యు), కెరమెరి మండలాల అధ్యక్షులు, సంఘ నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
