సంగారెడ్డి జైలులో మామిడి పంట బహిరంగ వేలం
సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : సంగారెడ్డి కేంద్ర కారాగారం ఆవరణలోని మామిడి తోటలో పండిన మామిడి పండ్లను 2026 సంవత్సరానికి గాను శుక్రవారం బహిరంగ వేలం వేశారు. కేంద్ర కారాగారం ప్రాంగణంలో ఉదయం 10:30 గంటలకు కారాగారం పర్యవేక్షణాధికారి సంతోష్ కుమార్‌రాయ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేలంలో సుమారు 20 మంది వ్యాపారులు పాల్గొన్నారు.
వేలంలో సంగారెడ్డికి చెందిన మహమ్మద్ నసీర్ పాషా అత్యధికంగా రూ.1,80,000 ధర పాడి మామిడి పంటను దక్కించుకున్నారు. వేలం ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించినట్లు జైలు సూపరింటెండెంట్ తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర కారాగారం సూపరింటెండెంట్ సంతోష్‌రాయ్ మాట్లాడుతూ ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా మామిడి పంటకు మంచి స్పందన లభించిందని పేర్కొన్నారు. అత్యధిక ధర పాడిన మహమ్మద్ నసీర్ పాషాకు మామిడి పంట కేటాయించినట్లు వెల్లడించారు.
