పిఠాపురం| రాష్ట్రంలో రేషన్ షాపుల పునః ప్రారంభం కార్యక్రమానికి పిఠాపురంలో ఆదివారం ఉదయం శ్రీకారం చుట్టారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్.
.పిఠాపురం పట్టణం 18వ వార్డులో రేషన్ షాపును ప్రారంభించి కార్డుదారులకి బియ్యం అందించారు.
ఈ కార్యక్రమంలో శాసన మండలి విప్ పిడుగు హరిప్రసాద్, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, మాజీ ఎమ్మెల్యే వర్మ, సివిల్ సప్లైస్ కార్పోరేషన్ ఛైర్మన్ తోట సుధీర్, డీసీసీబీ ఛైర్మన్ తుమ్మల బాబు, సివిల్ సప్లైస్ సెక్రెటరీ సౌరభ్ గౌర్, కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా తదితరులు పాల్గొన్నారు