Police | అదే.. బైక్ దొంగ టార్గెట్..

Police | అదే.. బైక్ దొంగ టార్గెట్..

Police, పామర్రు, ఆంధ్రప్రభ : అంతర్రాష్ట్ర మోటర్ బైక్ ల దొంగను పామర్రు పోలీసులు పట్టుకున్నారు. పామర్రు మండలం జుజ్జువరం గ్రామానికి చెందిన భాస్కర్ రెడ్డిని అరెస్టు చేశారు. నిందితుడి వద్ద రూ.22.50 లక్షల విలువ చేసే 45 ద్విచక్ర వాహనాలు రికవరీ చేశారు. పామర్రు పోలీసులను కృష్ణాజిల్లా ఎస్పీ (SP) విద్యాసాగర్ నాయుడు అభినందించారు. రికవరీ చేసిన వాహనాలను ఎస్పీ పరిశీలించారు. దొంగను పట్టుకోవడంలో చాకచక్కగా వ్యవహరించిన సీఐ సుభాకర్, ఎస్సైలు రాజేంద్రప్రసాద్, సత్యకళ, ఇతర బృందానికి ఎస్పీ విద్యాసాగర్ నాయుడు అభినందించారు.

Police | ఎస్పీ విద్యాసాగర్ నాయుడు మాట్లాడుతూ..

దొంగ భాస్కర్ రెడ్డి 26 కేసుల్లో, 45 మోటార్ బైక్ లు చోరీ చేశాడన్నారు. హీరో (Hero) బైక్ లే టార్గెట్ చేస్తూ అత్యధికంగా గ్లామర్ వాహనాలను చోరీ చేశాడన్నారు. దొంగిలించిన బైక్ లను 2,3 వేల అప్పు కోసమే తాకట్టు పెట్టేవాడన్నారు. కృష్ణ, ఎన్టీఆర్ జిల్లాల పరిధిలో 8 పోలీస్ స్టేషన్ల పరిధిలో చోరీలకు పాల్పడ్డాడన్నారు. 19 వాహనాలు ఏ స్టేషన్లో పరిధిలో చోరీ చేశాడో ధ్రువీకరణ కావలసి ఉందన్నారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించి నిందితుడిని పట్టుకున్న సీఐ సుభాకర్, ఎస్ఐలు రాజేంద్రప్రసాద్, సత్య కళ ఇతర సిబ్బందికి ఎస్పీ నగదు రివార్డులు అందజేశారు.

Police
Police

https://www.google.com/search?q=prabhanews&oq=pr&aqs=chrome.0.69i59l2j69i57j0i433i512l2j0i512j0i433i512j0i131i433i512j0i433i512j46i433i512.2051j0j15&sourceid=chrome&ie=UTF-8