Shabad | బీఆర్ఎస్ నేతలకు అడ్డుకట్ట..
షాబాద్ హత్యల నేపథ్యంలో పరామర్శించేందుకు వెళ్తున్న నేతలు..
మాజీ మంత్రులు సబితారెడ్డి, సత్యవతి రాథోడ్, పద్మా దేవేందర్ రెడ్డి అరెస్టు…
ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్టు పోలీస్ స్టేషన్ కు తరలింపు…
Shabad | చేవెళ్ల, ఆంధ్రప్రభ : షాబాద్ మండలంలో ఆరుగురిని హత్య చేసిన ఘటన నేపథ్యంలో బాధితులను మరణర్శించేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నేతలను పోలీసులు అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. తనపై కేసు పెట్టారని కోపంతో ఒక కుటుంబానికి చెందిన ముగ్గురిని దారుణంగా హత్య చేయడంతోపాటు తన కుటుంబానికి చెందిన ముగ్గురిని రాజ్ అనే వ్యక్తి దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటన నేపథ్యంలో బాధితులను మరామర్శించేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ నేతలను పోలీసులు మల్కాపురం చౌరస్తా వద్ద అడ్డుకున్నారు.

మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి లు షాబాద్ వెళుతున్నారు. వీరిని పోలీసులు మల్కాపురం చౌరస్తా వద్ద అడ్డుకున్నారు. దీంతో బీఆర్ఎస్ నేతలకు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. సొంత వాహనాలు కాకుండా ఆర్టీసీ బస్సులో వెళ్లేందుకు సబితారెడ్డి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. చాలా సేపు రోడ్డుపై నిలిచిపోయాయి. సబితారెడ్డి, పద్మా దేవేందర్ రెడ్డిలను పోలీసులు చేవెళ్ల పోలీసు స్టేషన్ కు తరలించారు. మాజీ పోలీసు అధికారి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిలను కూడా పోలీసులు అడ్డుకున్నారు. వీరిని షాబాద్ చౌరస్తా వద్ద అడ్డుకొని శంకర్ పల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీసుల తీరుపై భారాస నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
