శ్రీ సత్యసాయి బ్యూరో (ఆంధ్రప్రభ): రాష్ట్ర బీసీ సంక్షేమం, చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత ఆటో వాలా గా మారారు. ఆదివారం శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణము కు చెందిన ఎన్.బి.కె ఫ్యాన్స్, తెలుగుదేశం పార్టీ కార్యకర్త వడ్డే రాముకు స్వయం ఉపాధి కోసం మంత్రి సవిత తన సొంత నిధులతో నూతన ఆటోను కొనిచ్చి,కానుక ఇచ్చారు .ఈ సందర్భంగా మంత్రి ఆటోను స్వయంగా నడిపి కార్యకర్త రాముకు అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు తగిన విధంగా అండగా ఉండడంలో తన వంతు కర్తవ్యం గా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. అదేవిధంగా ప్రతి కార్యకర్తకు అండగా ఉండేందుకే ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.