అమెరికాలో కుప్పకూలిన విమానం..

అమెరికాలో కుప్పకూలిన విమానం..

అమెరికాలోని లూయిస్ విల్లేలో విమానం కుప్పకూలిపోయింది. టేకాఫ్ సమయంలోనే యూపీఎస్ కార్గో విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు. 11 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. యూపీఎస్ ఫ్టైట్ నెంబర్ 2976 విమానం హోనులులుకు అమెరికా కాలమానం ప్రకారం సాయంత్రం 5.15 నిమిషాలకు బయలుదేరగా ప్రమాదానికి గురైంది. ఈ విషయాన్ని అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ధృవీకరించింది. విమానం గాల్లోకి ఎగురుతున్న సమయంలో ఒక్కసారిగా మంటలు రావడంతో కుప్పకూలిపోయింది. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.