MLA | పెన్షన్లు ఘనత కూటమిదే..

MLA | పెన్షన్లు ఘనత కూటమిదే..
ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు….
MLA | (ఆంధ్రప్రభ తిరువూరు) : దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లోనే అత్యధికంగా 4వేల రూపాయల పెన్షన్ అందిస్తున్న ఘనత కూటమీ ప్రభుత్వానికి దక్కుతుందని తిరువూరు శాసనసభ్యుడు శ్రీనివాసరావు (Srinivasarao) పేర్కొన్నారు. నిరుపేదలకు ఎంతో ఆర్థిక భరోసాన్నిస్తున్న ఈ పెన్షన్లు క్రమం తప్పకుండా ప్రతి నెల అర్హులైన ప్రతి ఒక్కరికి అందిస్తున్నట్లు చెప్పారు. తిరువూరు మండలంలోని 5 గ్రామాలలో పెన్షన్ పంపిణీ కార్యక్రమములో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పాల్గొని స్వయంగా పంపిణీ చేశారు. తిరువూరు మండలంలోని లక్ష్మీపురం,ఆంజనేయపురం, చిట్టేల, చౌటపల్లి,చిక్కులగూడెం గ్రామాలలో పర్యటిస్తూ వృద్ధులకు,వికలాంగులకు,ఒంటరి మహిళల పెన్షన్లు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పంపిణీ చేశారు.
అనంతరం ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం (GOVT) అధికారంలోకి వచ్చిన వెంటనే 3 వేల రూపాయల పెన్షన్ ను 4 వేలకు పెంచిందని, అని,వికలాంగులకు 6వేలు,10వేలు,15 వేల రూపాయల చొప్పున పెన్షన్లు అందిస్తున్నామన్నారు. కార్యక్రమములో మండల స్థాయి కూటమి పార్టీల నాయకులు, ఆయా గ్రామాల కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
