పెండింగ్ బకాయిలు చెల్లించాలి..

పెండింగ్ బకాయిలు చెల్లించాలి..
కడెం, ఆంధ్రప్రభ : ఉద్యోగ ఉపాధ్యాయుల పెండింగ్ పిఆర్సి డిఎ పెండింగ్ బకాయిలు చెల్లించాలని పిఆర్టియు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు కోట వేణు ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. బుధవారం మండల కేంద్రమైన కడెంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్లో విద్యకు 8 శాతం మాత్రమే కేటాయించడం సరికాదని ఆయన అన్నారు.
విద్యలో మౌలిక వసతులు అభివృద్ధి కోసం విద్యా కమిషన్ సూచించిన 18% నిధులు బడ్జెట్లో కేటాయించకపోవడం శోచనీయం. అదే విధంగా పిఆర్సి గడువు దాటి మూడు సంవత్సరాలు అవతున్నా దానికి సంబంధించి బడ్జెట్ లో పేర్కొన పోవడం సరికాదన్నరు. పెండింగ్ బకాయిలు చెల్లించకపోవడం వల్ల రిటైర్మెంట్ అయిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు మానసికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కావున ప్రభుత్వం ఇప్పటికైనా పెండింగ్ బకాయిలు, పిఆర్సి,డిఎలు వెంటనే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.
